టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు లగ్జరీ ఫీచర్స్, ధర ఇవే..!

టాటా మోటార్స్( TATA Motors ) ఆటోమొబైల్ కంపెనీ గతంలో వాణిజ్య అవసరాల కోసం ఎలక్ట్రిక్ వెహికల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేసి నెక్సాన్ ఈవీ లగ్జరీ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

 Tata Nexon Electric Car Price Features,tata Nexon Electric Car,nexon Ev,tata Nex-TeluguStop.com

తాజాగా విడుదల అయిన ఈ నెక్సాన్ ఈవీ కారును కొత్త వర్షన్ లోకి తీర్చిదిద్దింది.ఈనెల తొమ్మిదవ తేదీ అంటే ఈరోజు నుంచి ఈ కారు బుకింగ్స్ ఆరంభం అవ్వనున్నాయి.ప్రారంభంలో రూ.21000 రూపాయలను చెల్లించి ఈ కారును ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Telugu Electric Car, Nexon Ev, Tatanexon, Technoloogy-Technology Telugu

టాటా నెక్సాన్ ఈవీ( TATA Nexon EV ) ఫేస్ లిఫ్ట్ రెండు డిఫరెంట్ వేరియంట్లలో లభిస్తుంది.లాంగ్ రేంజ్, మిడ్ రేంజ్ లలో ఈ కారు అందుబాటులో ఉంది. లాంగ్ రేంజ్ వేరియంట్( TATA Nexon EV Long Range ) 40.5 కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంది.ఒక్కసారి చార్జింగ్ చేస్తే 465 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.ఈ కారు కెపాసిటీ 102 బీహెచ్పీ.215 ఎన్ఎం టార్క్ ను విడుదల చేయగలదు.8.9 సెకండ్ల వ్యవధిలోనే గరిష్టంగా 100 కిలోమీటర్ల స్పీడ్ ను అందుకోగలదు.

ఇక మిడ్ రేంజ్ వేరియంట్( TATA Nexon EV Mid Range Variant ) బ్యాటరీ బ్యాకప్ 30 kwh.ఒకసారి చార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.దీని కెపాసిటీ 127 బీహెచ్పీ.215 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.కార్ ఇంటీరియర్ లో కొన్ని ఎక్స్ట్రార్డినరీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.8- స్పీకర్ జేబీఎల్ తో ఆడియో పని చేస్తుంది.

Telugu Electric Car, Nexon Ev, Tatanexon, Technoloogy-Technology Telugu

ఈ కారు ధర విషయానికి వస్తే.నెక్సాన్ ఈవీ మిడ్ రేంజ్ కారు ప్రైమ్ ధర రూ.14.49 లక్షలు నుంచి హైఎండ్ లో 17.19 లక్షల రూపాయలు.లాంగ్ రేంజ్ కారు ధర రూ.16.49 లక్షల రూపాయల వద్ద ఆరంభం అవుతుంది.హై ఎండ్ కారు ధర రూ.19.54 లక్షలు.ఈ కారు ఫ్లేమ్ రెడ్, పర్పుల్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ఇంటెన్సీటెల్, క్రియేటివ్ ఓషన్ బ్లూ, డేటానో గ్రే, ప్రిస్టైన్ వైట్ రంగులలో లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube