చాలా మంది హీరోయిన్లు సౌత్ ఇండస్ట్రీలో నటించి ఇంత పేరు ప్రఖ్యాతలు డబ్బు పలుకుబడి సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నారు.అక్కడ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకున్నటువంటి తరుణంలో సౌత్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.
ఇలా ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ సౌత్ సినిమాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే తాజాగా నటి తమన్న( Tamannaah )సైతం సౌత్ ఇండస్ట్రీ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగు తమిళ భాష చిత్రాలలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి తమన్న ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood Industry )లో సినిమాలు అలాగే వెబ్ సిరీస్లలో నటించే అవకాశాలను అందుకుంటున్నారు.అయినప్పటికీ హీరోయిన్గా సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి తమన్న తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు సినిమాల గురించి ప్రశ్న ఎదురయింది.
సౌత్ సినిమాలలో ఎక్కువగా హీరోయిజాన్ని హైలైట్ చేస్తారు.అలా హీరోయిజం ఎక్కువగా ఉన్న కారణంగా మీరు ఎప్పుడైనా సినిమాలను రిజెక్ట్ చేశారా అన్న ప్రశ్న ఎదురైంది.
ఈ ప్రశ్నకు తమన్నా సమాధానం చెబుతూ.చాలా సింపుల్ గా ఉండే కొన్ని ఫార్ములాలు ఉపయోగిస్తుంటారు.ముఖ్యంగా కమర్షియల్ సినీమాలలో( Commercial Movies ) నా పాత్రకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.అదేవిధంగా కొన్ని సినిమాలలో హీరోయిజం తగ్గించమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని ఈమె వెల్లడించారు.
రాను రాను ఇలాంటి సన్నివేశాలు చేయడం మానేశా.అలాంటి సినిమాలకూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
ఇక సౌత్ లో ఈ మధ్యకాలంలో పురుషాధిక్యత అధికంగా ఉన్నటువంటి సినిమాలను వీలైనంతవరకు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఈమె చేసిన కామెంట్లపై సౌత్ సినీ ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.