దివంగత హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు( Rebel Star Krishnam Raju ) గురించి మనందరికీ తెలిసిందే.ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఆయన జయంతి సందర్భంగా ఆయన భార్య మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా శ్యామలాదేవి( Syamala Devi ) మాట్లాడుతూ భర్తను తలుచుకొని ఆమె ఎమోషనల్ అయ్యారు.
అంతేకాకుండా ప్రభాస్ కి సంబంధించిన విషయాల గురించి కూడా ఆమె స్పందించారు.జనవరి 20 రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి.
ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సతీమణి శ్యామలాదేవి( Krishnam Raju Wife ) మాట్లాడుతూ.కృష్ణంరాజు లేరన్న విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నాను.ఆ విషాదం నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాను.ప్రభాస్, పిల్లలు ఇస్తున్న ధైర్యమే అందుకు కారణం.అలాగే ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో మా కుటుంబంపై కొన్ని రకాల ట్రోల్స్ చేస్తున్నారు.అవి నాకు ఎంతో బాధను కలిగించాయి అ ఐ తెలిపారు శ్యామలాదేవి.
ముఖ్యంగా కృష్ణంరాజు కుటుంబానికి, ప్రభాస్( Prabhas Family ) కుటుంబానికి పడటం లేదని రాయడం వల్ల వారికీ ఎటువంటి లాభం ఉంటుందో అర్థం కావడం లేదు అని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల ప్రభాస్ ఆరోగ్యం గురించి జ్యోతిష్యులు వేణుస్వామి( Astrologer Venuswamy ) చేసిన కామెంట్స్ చూసానని అవి ఎంతగానో బాధించాయి.ప్రభాస్ జాతకం తన మదర్‌కి మాత్రమే తెలుసునని, వేణుస్వామికి ఎలా తెలుస్తుందని ఆమె ప్రశ్నించారు.వేణుస్వామి వ్యాఖ్యలు పట్టించుకోవద్దని ప్రభాస్ అభిమానులకు సూచించారు శ్యామలాదేవి.
గతంలో వేణుస్వామి ప్రభాస్ పెళ్లి( Prabhas Marriage ) గురించి, సినిమాల గురించి తన కెరియర్ గురించి మీడియా ఇంటర్వ్యూల్లో కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడ్డారు.
తాజా ఇంటర్వ్యూ ద్వారా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి వేణుస్వామికి గట్టి సమాధానం ఇచ్చినట్లైంది.