Venu Swamy Syamala Devi : వేణుస్వామి చేసిన కామెంట్లు ఎంతో బాధపెట్టాయి.. ప్రభాస్ పెద్దమ్మ సంచలన వ్యాఖ్యలు వైరల్!

దివంగత హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు( Rebel Star Krishnam Raju ) గురించి మనందరికీ తెలిసిందే.

ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఆయన జయంతి సందర్భంగా ఆయన భార్య మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా శ్యామలాదేవి( Syamala Devi ) మాట్లాడుతూ భర్తను తలుచుకొని ఆమె ఎమోషనల్ అయ్యారు.

అంతేకాకుండా ప్రభాస్ కి సంబంధించిన విషయాల గురించి కూడా ఆమె స్పందించారు.జనవరి 20 రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి.

"""/"/ ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సతీమణి శ్యామలాదేవి( Krishnam Raju Wife ) మాట్లాడుతూ.

కృష్ణంరాజు లేరన్న విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నాను.ఆ విషాదం నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాను.

ప్రభాస్, పిల్లలు ఇస్తున్న ధైర్యమే అందుకు కారణం.అలాగే ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో మా కుటుంబంపై కొన్ని రకాల ట్రోల్స్ చేస్తున్నారు.

అవి నాకు ఎంతో బాధను కలిగించాయి అ ఐ తెలిపారు శ్యామలాదేవి.ముఖ్యంగా కృష్ణంరాజు కుటుంబానికి, ప్రభాస్( Prabhas Family ) కుటుంబానికి పడటం లేదని రాయడం వల్ల వారికీ ఎటువంటి లాభం ఉంటుందో అర్థం కావడం లేదు అని ఆమె పేర్కొన్నారు.

"""/"/ ఇటీవల ప్రభాస్ ఆరోగ్యం గురించి జ్యోతిష్యులు వేణుస్వామి( Astrologer Venuswamy ) చేసిన కామెంట్స్ చూసానని అవి ఎంతగానో బాధించాయి.

ప్రభాస్ జాతకం తన మదర్‌కి మాత్రమే తెలుసునని, వేణుస్వామికి ఎలా తెలుస్తుందని ఆమె ప్రశ్నించారు.

వేణుస్వామి వ్యాఖ్యలు పట్టించుకోవద్దని ప్రభాస్ అభిమానులకు సూచించారు శ్యామలాదేవి.గతంలో వేణుస్వామి ప్రభాస్ పెళ్లి( Prabhas Marriage ) గురించి, సినిమాల గురించి తన కెరియర్ గురించి మీడియా ఇంటర్వ్యూల్లో కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడ్డారు.తాజా ఇంటర్వ్యూ ద్వారా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి వేణుస్వామికి గట్టి సమాధానం ఇచ్చినట్లైంది.

ప్రియురాలిని ఎడారి ఎండ నుంచి కాపాడటానికి బాయ్‌ఫ్రెండ్ సంచలన నిర్ణయం.. నెటిజన్లు ఫిదా..?