టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి( Surekha vani ) తన కుమార్తె సుప్రీతను ( Supritha ) హీరోయిన్గా చేయాలని ఎన్నో కలలు కన్నారు.అయితే ఈమె కలలు నెరవేరాయని చెప్పాలి.
ప్రస్తుతం సుప్రీత హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్( Bigg Boss ) రన్నర్ బుల్లితెర నటుడు అమర్ దీప్ ( Amar Deep ) హీరోగా ఇటీవల ఒక సినిమా అనౌన్స్ చేశారు.
ఈ సినిమాలో అమర్ సరసన సుప్రీత నటిస్తున్నారు.
ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ సినిమా షూటింగ్ పనులు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను సుప్రీత సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.రాత్రి 1:45 అయినప్పటికీ కూడా ఇంకా షూట్ జరుగుతుందంటూ ఈమె షూటింగ్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వర్క్ వర్క్ వర్క్ అంటూ కామెంట్ చేశారు.
ఇక తెల్లవారుజామున 3 సమయంలో ప్యాకప్ చెప్పారు అంటూ ఈమె మరొక పోస్ట్ షేర్ చేశారు.ఇలా ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ చేయడంతో ఈమెకు రాత్రి నిద్రలేకుండా రాత్రంతా కూడా షూటింగ్ పనులు చేయిస్తూ డైరెక్టర్ ఈమెను ఏ విధంగా అయితే వాడుకోవాలో అదే విధంగా వాడుకుంటున్నారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.
పాపం మొదటి సినిమాకే డైరెక్టర్ సుప్రీతను చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటూ మరికొందరు ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.