శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం( Madakasira Assembly constituency )లో టీడీపీకి షాక్ తగిలింది.ఈ మేరకు టీడీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే మడకశిర నియోజకవర్గం( Madakasira Assembly constituency )లో డా.సునీల్ కుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం రెబల్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ తమను నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తూ ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అదేవిధంగా ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
అయితే నియోజకవర్గ టీడీపీ( TDP ) అభ్యర్థిగా మొదట సునీల్ కుమార్ కు టికెట్ కేటాయించిన అధిష్టానం ఆఖరికి ఎంఎస్ రాజుకు బీఫాం ఇచ్చింది.
దీంతో సునీల్ కుమార్ వర్గీయులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఇందులో భాగంగానే చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి.
టీడీపీ జెండాలను దహనం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మడకశిర నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.