ఆర్-5 జోన్‎పై సుప్రీంకోర్టు తీర్పు

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆర్ -5 జోన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి.

 Supreme Court Verdict On R-5 Zone-TeluguStop.com

ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని ధర్మాసనం పేర్కొంది.ఈ క్రమంలో హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది.

పట్టాలు పంపిణీ చేసినా హక్కుదారులకు హైకోర్టు తీర్పునకు లోబడే హక్కులు ఉంటాయని పేర్కొంది.లబ్ధిదారులు వేరే వాళ్లకు విక్రయించరాదంది.

అమరావతి కేసులో వచ్చే తుది తీర్పునకు లోబడే పట్టాల పంపిణీ ఉంటుందని తెలిపింది.ఈ క్రమంలోనే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం సవరించింది.

కాగా పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube