ఆర్-5 జోన్‌పై సుప్రీంకోర్టు తీర్పు
TeluguStop.com
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆర్ -5 జోన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి.ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని ధర్మాసనం పేర్కొంది.
ఈ క్రమంలో హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది.పట్టాలు పంపిణీ చేసినా హక్కుదారులకు హైకోర్టు తీర్పునకు లోబడే హక్కులు ఉంటాయని పేర్కొంది.
లబ్ధిదారులు వేరే వాళ్లకు విక్రయించరాదంది.అమరావతి కేసులో వచ్చే తుది తీర్పునకు లోబడే పట్టాల పంపిణీ ఉంటుందని తెలిపింది.
ఈ క్రమంలోనే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం సవరించింది.కాగా పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.
భారతదేశంపై చైనీయుడు ఊహించని కామెంట్స్.. “ఇదో మిస్టరీ ప్లేస్” అంటూ..