సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు తీసిన సినిమాలు కొన్ని హిట్ అయితే మరికొన్ని ఫ్లాఫ్ అవుతాయి.కానీ కొద్ది మంది దర్శకులు మాత్రమే తెరకెక్కించిన సినిమాలు వరుసగా హిట్ అవుతాయి.
అలాంటి వారిలో సుకుమార్ కూడా ఒకరు.ఈయన తన వెరైటీ కథలతో ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించారు.
అలాంటి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ఆర్య.అయితే ఈ సినిమాకి ముందుగా ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలను తీసుకోవాలనుకున్నారట…
కానీ వాళ్ళు రిజెక్ట్ చేయడంతో ఆ కథ దిల్ రాజు చెప్పిన అల్లు అర్జున్ తో తీశారు.
ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి సుకుమార్ కి ఇండస్ట్రీలో మంచి స్టేటస్ తీసుకొచ్చి పెట్టింది.ఆ తర్వాత తన రెండో సినిమా కోసం చాలానే కసరత్తులు చేశారు సుకుమార్.
ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా జగడం.అయితే ఈ సినిమా స్టోరీ వెనుక పెద్ద కథ నే నడిచిందట.
ఇక అసలు విషయంలోకి వెళ్తే…జగడం సినిమాని కూడా అల్లు అర్జున్ తో తీయాలి అని సుకుమార్ భావించారు.ఇక స్టోరీని కూడా అల్లు అర్జున్( Allu rajun ) తో చెబితే చాలా బాగుంది సూపర్ త్వరలోనే సినిమా తెరకెక్కిద్దాం కానీ సినిమాలో కాస్త మార్పులు చేయండి అని చెప్పారట…
అయితే సినిమాని తాను అనుకున్న విధంగానే తెరకెక్కించాలి అనుకున్న సుకుమార్ సినిమా స్టోరీని మార్చడానికి వీలు కాదని, కథ మార్చకుండా వేరే హీరోతో తీస్తాను అని చెప్పారట.ఇక అప్పుడే దేవదాసు సినిమాతో హిట్ కొట్టిన రామ్ పోతినేని తో జగడం సినిమాని అనుకున్నారు.ఇక ఈ సినిమా ప్రారంభించే రోజు అతిథులుగా దిల్ రాజు , మహేష్ బాబు( mahesh babu , ),అల్లు అర్జున్ ని ఆహ్వానించారు.ఇక అదే రోజు సుకుమార్ ఎలాగైనా ఈ సినిమాని కథ మార్చకుండా హిట్టు కొట్టి తీరుతాను చూడు అంటూ మహేష్ బాబు,అల్లు అర్జున్ తో శపథం చేశారట…
కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన జగడం సినిమా( Jagadam ) అట్టర్ ప్లాఫ్ అయ్యింది.ఈ సినిమాలో అన్ని బాగున్నప్పటికీ అప్పటి జనాలు ఎందుకో ఈ సినిమాను ఆదరించలేకపోయారు.దాంతో ఈ సినిమా సుకుమార్ ఆశలను అడియాశలు చేసింది.అయితే జగడం సినిమా ఎందుకు ప్లాఫ్ అయిందో ఇప్పటికీ కూడా చాలామందికి అర్థం కాదు.ఎందుకంటే అది ఒక క్లాసిక్ మూవీ.ఈ సినిమా రిజల్ట్ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ ని అడిగితే నేను ఆ సినిమాని బాగానే తీశాను కానీ ఎందుకో అప్పటి ప్రేక్షకులు దాన్ని ఆదరించ లేకపోయారు అని చెప్పారట.
ఈ విధంగా మహేష్ బాబు,అల్లు అర్జున్ లతో శపధం చేసి సుకుమార్ ఓడిపోయారని అప్పటి ఇండస్ట్రీ జనాలు కామెంట్లు చేశారు….ఇక ఆ తర్వాత మహేష్ తో అల్లు అర్జున్ తో కూడా సుకుమార్ సినిమాలు చేశాడు…
.