వాల్తేరు నుండి పవర్ ఫుల్ వీడియో.. ఈ సంక్రాంతికి పూనకాలే అంటున్న మాస్ రాజా!

మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ నటిస్తున్న ప్రాజెక్టుల్లో వాల్తేరు వీరయ్య ఒకటి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ దాదాపు పూర్తి అయ్యింది.ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.ఈ సినిమాలో చిరు మాత్రమే కాదు మాస్ రాజా రవితేజ కూడా కీలక రోల్ ప్లే చేస్తున్న విషయం ఇప్పటికే అందరికి తెలుసు.

 Stunning Action Glimpse Of Ravi Teja From Waltair Veerayya, Ravi Teja First Look-TeluguStop.com

చాలా రోజుల తర్వాత చిరు, రవితేజ కాంబోలో సినిమా రాబోతుండడంతో మరింత ఆసక్తిగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇప్పటి వరకు బాబీ రవితేజ పాత్ర గురించి ఎలా అప్డేట్ ఇవ్వలేదు.

అయితే తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే వీడియో రిలీజ్ చేసారు.మాస్ మహారాజా రవితేజ పాత్రను పరిచయం చేస్తూ చిన్న వీడియోను రిలీజ్ చేసారు.

ఈ వీడియో చూస్తుంటే సంక్రాంతికి ఇక పూనకాలే అని అనిపిస్తుంది.ఈ వీడియోలో మాస్ రాజా నట విశ్వరూపాన్ని బాబీ చూపించ బోతున్నట్టు అనిపిస్తుంది.

రవితేజ విక్రమ్ సాగర్ ఏసిపి అని పోస్టర్ రిలీజ్ చేసారు.ఈయన క్యారెక్టర్ ను చాలా పవర్ ఫుల్ గా తీర్చి దిద్దినట్టు కూడా అనిపిస్తుంది.చిన్న వీడియో అయిన మాస్ రాజా చెప్పిన డైలాగ్స్ కి రాక్ స్టార్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నారు.

చూడాలి మరి ఈ సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ ను ఈ సినిమాతో చిరు, రవితేజ ఎలా అలరిస్తారో.

ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.రవితేజ, మెగాస్టార్ కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీ ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube