టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నా మగధీర, రంగస్థలం, ఆర్.ఆర్.
ఆర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే స్టార్ హీరో రామ్ చరణ్ టాలెంట్ కు తగిన సినిమా ఇంకా పడలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చాలామంది దర్శకనిర్మాతలు రామ్ చరణ్ టాలెంట్ ను సరిగ్గా వినియోగించుకోలేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.
రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తుండగా దసరా కానుకగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ విడుదల కానుంది.రంగస్థలం మహేశ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చరణ్ చాలా సరదాగా ఉంటారని మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారని కామెంట్లు చేశారు.
సామ్ మనస్సు మంచిదని ఎవరికైనా సాయం చేసే విషయంలో సమంత ముందువరసలో ఉంటారని మహేశ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రభాస్( Prabhas ) గారు నేను స్లిప్పర్స్ వేసుకోకపోతే స్లిప్పర్స్ ఎందుకు వేసుకోలేదని చెబుతూ కేర్ తీసుకున్నానని రంగస్థలం మహేశ్ కామెంట్లు చేశారు.రామ్ చరణ్ గారి టైమింగ్ కు తగిన సినిమా ఇప్పటివరకు పడలేదని చాలా షార్ప్ టైమింగ్ ఉంటుందని మహేశ్ అన్నారు.అలాంటి పాత్ర చరణ్ కు పడాలని ఆయన తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ గారు హైపర్ ఎనర్జీ అని మహేశ్ వెల్లడించారు.
జూనియర్ ఎన్టీఆర్ అందరితో బాగుంటారని ఆయన దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాగా ఆయన హాజరైన ఈ సినిమా ఏకంగా 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని రంగస్థం మహేశ్ వెల్లడించారు.రంగస్థలం మహేశ్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.చరణ్, తారక్ ఫ్యాన్స్ కు రంగస్థలం మహేశ్ కామెంట్స్ సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
చరణ్ కు సరైన సినిమా పడితే చరిత్ర తిరగరాస్తారని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.