బన్నీ గొప్పదనం గురించి ఈ విషయాలు తెలుసా.. తండ్రిని కోల్పోయిన ఆ విద్యార్థినికి ఇంత సాయం చేశారా?

Star Hero Bunny Greatness Details Here Goes Viral In Social Media , Allu Arjun, Greatness , Kerala, Trivikram , Student , Social Media, Pushpa 2, Sukumar

సినిమా ఇండస్ట్రీలో కష్టాల్లో ఉన్నవాళ్లకు తమ వంతు సహాయం చేసే హీరోలు చాలామంది ఉన్నారు.అయితే ఈ హీరోలలో ఎక్కువమంది తాము చేసిన సహాయాలను చెప్పుకోవడానికి ఇష్టపడరు.

 Star Hero Bunny Greatness Details Here Goes Viral In Social Media , Allu Arjun,-TeluguStop.com

అల్లు అర్జున్( Allu Arjun ) ను కేరళ ప్రేక్షకులు మల్లూ అర్జున్ అని పిలుస్తారు.కేరళ రాష్ట్రంలో అక్కడి స్ట్రెయిట్ హీరోలకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న హీరోలలో బన్నీ ఒకరనే సంగతి తెలిసిందే.

అయితే కేరళ( Kerala)కు చెందిన ఒక విద్యార్థిని చదువుకు అయ్యే ఖర్చును బన్నీ భరిస్తున్నారు.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా తండ్రిని కోల్పోయిన ఒక కేరళ విద్యార్థినికి బన్నీ చదువు విషయంలో సహాయం చేస్తున్నారు.ఆ విద్యార్థిని నాలుగేళ్ల చదువు కోసం 8 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.ఈ విషయం గతేడాది వెలుగులోకి వచ్చినా పెద్దగా వైరల్ కాలేదు.

బన్నీ నిజంగా గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బన్నీ కెరీర్ విషయానికి వస్తే ఈ స్టార్ హీరో దాదాపుగా మూడేళ్ల సమయాన్ని పుష్ప2 మూవీ కోసమే కేటాయిస్తున్నారు.పుష్ప2 సినిమాలో సీన్లు సరికొత్తగా ఉండనున్నాయని ఈ సినిమా కోసం ఆ మాత్రం సమయం కేటాయించడంలో తప్పు లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అల్లు అర్జున్ వచ్చే ఏడాది సెకండాఫ్ నుంచి త్రివిక్రమ్( Trivikram ) సినిమాలో నటించే ఛాన్స్ ఉంది.పుష్ప2 సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా కొత్తగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.పుష్ప2 బడ్జెట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు వినిపిస్తున్నా మేకర్స్ స్పందిస్తే మాత్రమే అసలు లెక్కలు తెలిసే అవకాశం ఉంటుంది.పుష్ప2 సినిమా కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తుండగా ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.ఈ సినిమా సక్సెస్ సాధించడం సుకుమార్ కెరీర్ కు కూడా కీలకమనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube