Baladithya : పెద్దవాళ్లకు, ఆడవాళ్లకు రెస్పెక్ట్ విషయంలో బాలయ్య తర్వాతే ఎవరైనా.. బాలాదిత్య కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో బాలకృష్ణ( Star Hero Balakrishna )కు కోపం ఎక్కువని ఆయన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు.అయితే బాలయ్యతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు మాత్రం ఈ కామెంట్లతో అస్సలు ఏకీభవించారు.

 Star Hero Balakrishna Great In That Matter Details Her Goes Viral-TeluguStop.com

టాలీవుడ్ నటుడు బాలాదిత్య( Actor Baladitya ) పెద్దవాళ్లకు, ఆడవాళ్లకు రెస్పెక్ట్ విషయంలో బాలయ్య తర్వాతే ఎవరైనా అంటూ తాజాగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.లైట్ బాయ్ తో పక్కన కూర్చుని టీ తాగుతూ చాలా సరదాగా బాలయ్య మాట్లాడతారని బాలాదిత్య తెలిపారు.మా తాతగారి స్టూడెంట్ బాలయ్య అని ఉదయం 4.30 గంటలకు బాలయ్య మా ఇంటికి ట్యూషన్ కు వచ్చేవారని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Baladithya, Balakrishna, Bangaru Bullodu, Tollywood-Movie

బంగారు బుల్లోడు మూవీ( Bangaru Bullodu ) షూట్ సమయంలో మా అమ్మతో పాటు నేను బాలయ్యను కలవడానికి వెళ్లగా మా అమ్మను చూసిన వెంటనే బాలయ్య టక్కున లేచి నిలబడ్డారని బాలాదిత్య పేర్కొన్నారు.నేను మూర్తిగారి కోడలినని మా అమ్మ చెప్పిన వెంటనే కుర్చీ వేయించి మా అమ్మను గౌరవించారని ఆయన వెల్లడించారు.చాలామంది పెద్దవాళ్లు, ఆడవాళ్లు వచ్చిన సమయంలో సైతం బాలయ్య ఎంతో గౌరవంగా వ్యవహరించారని బాలాదిత్య అన్నారు.టేక్ కు వెళ్లేముందు ఒకసారి అద్దంలో చూసుకుని ప్రాక్టీస్ చేసుకో అని బాలయ్య సూచించారని ఆ సలహా ఇప్పటికీ పాటిస్తానని బాలాదిత్య తెలిపారు.

Telugu Baladithya, Balakrishna, Bangaru Bullodu, Tollywood-Movie

బాలయ్య భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) చూశానని ఆయన పేర్కొన్నారు.బాలయ్య కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.భగవంత్ కేసరి సినిమాలో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ సీన్స్ అద్భుతం అని బాలాదిత్య వెల్లడించారు.బాలయ్య సినిమా వల్ల ప్రేక్షకులకు అద్భుతమైన మెసేజ్ వెళ్లిందని ఆయన పేర్కొన్నారు.

తాను ఇద్దరు ఆడపిల్లల తండ్రినని బాలాదిత్య చెప్పుకొచ్చారు.బాలాదిత్య చెప్పిన విషయాలు విన్న ఫ్యాన్స్ ఇదీ బాలయ్య అంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube