ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ కోసం జక్కన్న సంచలన నిర్ణయం.. ఏమైందంటే?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.చరణ్, తారక్ లకు ఆర్ఆర్ఆర్ తో ఆ హీరోలు కోరుకున్న కెరీర్ బెస్ట్ హిట్ దక్కింది.

 Star Director Rajamouli Sensational Decision For Rrr Details Here,rajamouli,rrr,-TeluguStop.com

ఫిక్షనల్ కథతో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించింది.ఎన్నో ఆవాంతరాలను దాటుకుని సమ్మర్ కానుకగా విడుదలైన ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ అవుతుందని అందరూ భావించారు.

అయితే కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ కు బదులుగా ఛెల్లో షో అనే ఏ మాత్రం గుర్తింపు లేని సినిమాను ఆస్కార్ కు పంపింది.అయితే ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఆస్కార్ కోసం ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసుకోవడం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ కోసం జక్కన్న సంచలన నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఒక పీఆర్ ఏజెన్సీని నియమించిన రాజమౌళి ఈ ఏజెన్సీ ద్వారా ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ కోసం ప్రచారం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Telugu Chhello Show, Oscar Awards, Oscar, Rajamouli, Ram Charan, Sensational-Mov

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఆస్కార్ కోసం ప్రచారం జరిగేలా జక్కన్న అడుగులు వేస్తుండటం గమనార్హం.ఇందుకోసం కోట్ల రూపాయలు జక్కన్న ఖర్చు చేస్తున్నారని బోగట్టా.టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరో మూవీ బడ్జెట్ స్థాయి మొత్తాన్ని ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి ఖర్చు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ రావడానికి అన్ని అర్హతలు ఉన్న సినిమా అని జక్కన్న భావిస్తున్నారు.

ఈ సినిమాలో సీతారామరాజు పాత్రలో చరణ్ నటన, భీమ్ పాత్రలో తారక్ నటన న భూతో న భవిష్యత్ అనేలా ఉంటుంది.తారక్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.

చరణ్ కొన్ని సన్నివేశాల్లో చిన్నచిన్న ఎక్స్ ప్రెషన్లను సైతం అద్భుతంగా పలికించి ఆకట్టుకున్నారు.ఈ సినిమాకు ఆస్కార్ వస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube