నవంబర్ మంత్ వచ్చేసింది.దీంతో ఇద్దరి స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం కూడా దగ్గర పడుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ వీరి సినిమాల అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
మరి ఈ ఇద్దరు హీరోలు కూడా నవంబర్ మంత్ లోనే తమ టార్గెట్ పెట్టుకోవడంతో ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం” ( Guntur Kaaram )మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ హైప్ ఉంది.
అయితే ఇప్పటి వరకు పోస్టర్స్ తోనే సరిపెడుతూ వస్తున్న మేకర్స్ ఫస్ట్ సింగిల్ కోసం రెడీ అయ్యారు.అదే విధంగా రామ్ చరణ్ ( Ram Charan ) ప్రజెంట్ నటిస్తున్న సినిమాల్లో ‘‘గేమ్ ఛేంజర్( Game Changer ) ఒకటి.ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను దీపావళికి ఇస్తున్నట్టు పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేసారు.మరి ఈ రెండు సినిమాలకు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ పని చేస్తున్నాడు.
ఆయనే థమన్ (Thaman).తాజాగా థమన్ నవంబర్ మంత్ రాగానే ఒక పోస్ట్ చేసాడు.నవంబర్ వచ్చేసింది అంటూ. గుంటూరు కారం, గేమ్ ఛేంజర్ ట్యాగ్ లను యాడ్ చేస్తూ ఫైర్ ఎమోజీలను షేర్ చేసాడు.ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.మరి దీపావళి కానుకగా రాబోతున్న ఈ రెండు ఫస్ట్ సింగిల్స్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయో వేచి చూడాలి.