మీ చిన్న హృదయాలు స్వచ్చంగా ఉండాలి.. వైరల్ అవుతున్న చిరంజీవి చిన్నకూతురి పోస్ట్!

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) చిన్న కుమార్తెగా శ్రీజ ( Sreeja ) అందరికీ ఎంతో సుపరిచితమే.ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత కారణాలవల్ల పెద్ద ఎత్తున అందరికీ ఎంతో సుపరిచితమయ్యారు.

 Sreeja Konidela Viral Post On Internet , Megastar Chiranjeevi, Tollywood, Ram Ch-TeluguStop.com

తన పిల్లలతో కలిసి ఒంటరిగా ఉన్నటువంటి ఈమె తరచూ తన పిల్లలకు సంబంధించిన విషయాలతో పాటు తనుకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలలో భాగంగా తన పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు అన్నింటినీ కూడా శ్రీజ అభిమానులతో పంచుకున్నారు.

ఇకపోతే నవంబర్ 14 చిల్డ్రన్స్ డే( Childrens Day ) కావడంతో ఈమె మెగా, అల్లు పిల్లల సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇందులో భాగంగా అల్లు అర్జున్ పిల్లలతో పాటు తన పిల్లలు తన సోదరీ సుస్మిత పిల్లలు అందరూ కూడా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి శ్రీజ పిల్లల మనస్తత్వం గురించి కూడా ఒక నోట్ రాసుకోచ్చారు.ఇక్కడ ఉన్నటువంటి అన్ని చిన్ని హృదయాలు కూడా ప్రేమ, ఆనందం ,నవ్వు, ఉత్సాహంతో నిండి ఉండాలి .మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా గర్వంగా ఉంది.హ్యాపీ చిల్డ్రన్స్ డే( Happy Children’s Day ) అంటూ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫోటోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటో పై స్పందిస్తూ ఇలా ఒకే ప్రేమ్ లో మెగా మన వాళ్ళు మనవరాలను చూస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉంది.చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే మరి కొందరు మాత్రం మరో మెగా వారసురాలు మిస్ అయింది ఎక్కడ అంటూ రామ్ చరణ్ ( Ramcharan )కుమార్తె క్లీన్ కారా ( Klin Kaara ) గురించి కూడా ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ విధంగా మెగా అల్లు మనవళ్ళు మనవరాలు అంత ఓకే చోట కనిపించడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube