30 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ థియునిస్ డి బ్రుయిన్..!

దక్షిణాఫ్రికా క్రికెటర్ థియునిస్ డి బ్రుయిన్ 30 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.2017 లో దక్షిణాఫ్రికా తరఫున ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడడం ప్రారంభించాడు.అయితే ప్రోటీస్ నుండి బరిలోకి దిగిన థియునిస్ డి బ్రుయిన్ 13 టెస్టులు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడడం జరిగింది.2018లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆడి సెంచరీ తో అదరగొట్టాడు.తన క్రికెట్ కెరియర్ లో 496 పరుగులు చేశాడు.ఇక సౌత్ ఆఫ్రికా తరఫున టీ 20 లో ఆడిన థియునిస్ డి బ్రుయిన్ ఈ టోర్నీ లో 12 మ్యాచ్ లు అడి 238 పరుగులు చేయడం జరిగింది.

 South African Cricketer Theunis De Bruin Announced His Retirement At The Age Of-TeluguStop.com

అంతేకాకుండా ఈ టోర్నీ లో ప్రిటోరియా క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహించడం జరిగింది.

Telugu Domestic, Latest Telugu, Africa-Sports News క్రీడలు

ఇక అంతర్జాతీయ క్రికెట్ పై కాకుండా దేశవాళీ క్రికెట్ పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దేశవాళీ టోర్నీలలో, ఫ్రాంచైజీ క్రికెట్లో ఎక్కువగా రాణించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు.ఇక అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానని, తనను ఆ స్థాయిలో ఆడించి, అన్ని విషయాల్లో మద్ధతు గా నిలిచిన దక్షిణాఫ్రికా క్రికెట్ కు ధన్యవాదాలు తెలుపుకున్నాడు.

ఇక క్రికెట్లో తన దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఒక వరం లాగా భావిస్తున్నట్లు థియునిస్ డి బ్రుయిన్ తెలిపాడు.ప్రోటిస్ తరపున ఆడేటప్పుడు ప్రొటిస్ హీరోలతో డ్రెస్సింగ్ రూమ్ ను కూడా పంచుకున్నాడు.

మొత్తానికి అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ అభిమానుల్లో కాస్త నిరాశ నెలకొన్న, దేశవాళీ టోర్నీలలో, ఫ్రాంచైజీ క్రికెట్లో బాగా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube