27 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన నటి సౌందర్య. ఆమె సినిమాలోకి అడుగుపెట్టడానికి గల కారణం ఖచ్చితంగా అమే తండ్రి అనే చెప్పాలి.
ఎందుకంటే సౌందర్య తండ్రి సత్యనారాయణ కూడా స్వతహాగా రైటర్ మరియు నిర్మాత కాబట్టి.ఆయన నిర్మాతగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో అయన కొన్ని సినిమాలు తీశారు.
అందుకే తండ్రి వారసత్వాన్ని సౌందర్య పుణికి పుచ్చుకుంది అలాగే సౌందర్య అన్నయ్య అమర్ నాథ్ కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాడు.సౌందర్య తో పాటు ఎల్లప్పుడూ ఉండే అమర్ నాథ్ ఆమెతో పాటే విమాన ప్రమాదంలో కన్నుమూశాడు.
ఇక సౌందర్య సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న టైంలో తన తండ్రి కన్నుమూశాడు తండ్రి గుర్తుగా అతడికి ఒక సినిమా తీసి డెడికేట్ చేయాలని భావించారు ఆమె కుటుంబ సభ్యులు.1999లో ఒక కథ అనుకోని దాన్ని పూర్తిస్థాయిలో సినిమాగా మలచడానికి నాలుగేళ్ల సమయం తీసుకొని 2002లో ఒక సినిమాని విడుదల చేశారు.ఆ చిత్రం పేరు ద్వీప.పూర్తిగా కన్నడలోనే తీయబడ్డ ఈ సినిమా అవార్డుల పరంగా పంట పండించింది.ఏకంగా ఈ సినిమాకి ఫిలిం పేరుతో పాటు 14 అవార్డులు వరించాయి.ద్వీప సినిమా పూర్తిగా తన తండ్రి జ్ఞాపకార్థం మాత్రమే నిర్మాతగా మారి హీరోయిన్ గా కూడా నటిస్తూ సౌందర్య తీయడం విశేషం.
ఎందుకంటే తన తండ్రి ఆమె దృష్టిలో మొదటి గురువు.సత్యనారాయణ లాంటి తండ్రి దొరకడం సౌందర్య అదృష్టం.అలాగే సత్యనారాయణ సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడు.సరైన మార్గంలో పిల్లలని గైడ్ చేశాడు.అంతేకాదు సౌందర్య జీవితం మొత్తం కూడా ముందుగానే ఊహించి ఒక జాతకం కూడా రాశాడు.ఎందుకంటే సత్యనారాయణకి జ్యోతిష్యం కూడా తెలుసు.
ఆమె అతి చిన్న వయసులో నేను చనిపోతుందని ఆలోపే అగ్ర పదాన దూసుకుపోతుందని ఆయన అంచనా వేసి చెప్పాడు.ఇక ఎన్నో సినిమాలు తీసి బంగారు భవిష్యత్తు ఉన్న సౌందర్య ఐదు నెలల గర్భంతో విమాన ప్రమాదంలో కన్నుమూసింది.