సిగరెట్‌ తాగితే తప్పేం లేదు.. కాని అతడికి మాత్రం లక్ష ఫైన్‌ పడింది

ఇండియాలో సిగరెట్‌ స్మోకింగ్‌ అనేది బ్యాన్‌.పబ్లిక్‌ ప్లేస్‌లలో సిగరెట్లు తాగేవారికి జరిమానా మరియు జైలు శిక్ష ఉంటుంది.

 Smoker Fined 1 Lakh Above In Uk-TeluguStop.com

అయితే సిగరెట్‌లు మన ఇండియాలో ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉన్నాయి.వాటిని ఎక్కడ పడితే అక్కడ తాగేస్తూనే ఉన్నారు.

ఎలాంటి అడ్డు అదుపు లేకుండా సిగరెట్ల తాగడం, అది కూడా పబ్లిక్‌ ప్లేస్‌లలో తాగడం కామన్‌ అయ్యింది.అయితే పబ్లిక్‌ ప్లేస్‌లలో సిగరెట్లు తాగినా కూడా ఇండియాలో ఎలాంటి చర్యలు తీసుకోరు.

కాని విదేశాల్లో మాత్రం చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని నిరూపితం అయ్యింది.అయితే సిగరెట్‌ తాగడం అక్కడ సమస్య కాదు కాని, దాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయడం నేరం

తాజాగా యూకేలో జాన్‌ విల్సన్‌ అనే వ్యక్తి ఒక రైల్వే స్టేషన్‌లో నిల్చుని ఉన్నాడు.

అతడు సిగరెట్‌ తాగుతూ రైలు కోసం ఎదురు చూస్తున్నాడు.రైలు వచ్చే వరకు అతడు రెండు సిగరెట్లను తాగాడు.

అయితే అతడు సిగరెట్లను తాగడం వరకు ఓకే కాని ఆ సిగరెట్లను డస్ట్‌ బిన్‌లో వేయకుండా నేలపై వేసి దాన్ని కాలుతో రాసి ఆర్పేశాడు.పబ్లిక్‌ ప్రదేశాల్లో సిగరెట్లు అలా వేయడం యూకేలో చట్ట విరుద్దం.

అందుకే విల్సన్‌కు స్థానిక పోలీసులు మందలించి 7 వేల జరిమానా విధించారు.అయితే ఆ డబ్బు తాను కట్టను అంటూ ఉన్నత న్యాయస్థానంకు అతడు వెళ్లాడు.

సిగరెట్‌ తాగితే తప్పేం లేదు �

వాదనలు విన్న కోర్టు విల్సన్‌ చేసింది తప్పే అని నిర్ధారించి 7 వేల జరిమానా కాస్త 25 వేలకు పెంచాడు.విల్సన్‌ అక్కడితో ఆగకుండా కాంటేన్‌ బర్రీ కోర్టుకు వెళ్లాడు.అక్కడ కూడా విలన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది.అక్కడ జరిమానా కాస్త అయిదు రెట్లు పెరిగింది.లక్ష 15 వేల రూపాయలు అతడు జరిమానా కట్టాల్సిందే అంటూ తీర్పు వచ్చింది.అయితే విల్సన్‌ ప్రస్తుతానికి ఉద్యోగం ఏమీ చేయని కారణంగా జరిమానా కట్టడానికి సంవత్సరం సమయం ఇవ్వడం జరిగింది.

గడువు లోపు జరిమానా కట్టకుంటే విల్సన్‌ను జైల్లో పెట్టాలని నిర్ణయించుకున్నారు.ఇంతటి కఠినమైన శిక్షలు, జరిమానాలు మన వద్ద కూడా ఉంటే బాగుండేది కదా.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube