పంజాబ్ బ్యాటర్లకు వణుకు పుట్టించిన సిరాజ్..!

భారత జట్టు స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్( Mohammed Siraj ) ఐపీఎల్ లో తన సత్తా చాటుతూ.ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టిస్తున్నాడు.

 Siraj Made The Punjab Kings  Batters Tremble , Mohammed Siraj  , Virat Kohli , R-TeluguStop.com

బెంగుళూరు జట్టు విజయాల్లో సిరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.తాజాగా గురువారం బెంగుళూరు – పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ తన సత్తా ఏంటో చూపించాడు.

నాలుగు ఓవర్లకు 24 పరుగులు ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.బెంగళూరు జట్టు మొదటి వికెట్ కోల్పోయే సమయానికి డుప్లెసిస్ 84 పరుగులు, విరాట్ కోహ్లీ 59( Virat Kohli ) పరుగులతో 137 పరుగులు జోడించారు.

175 పరుగుల లక్ష్య చేదనకు దిగిన పంజాబ్ జట్టును ఆరంభంలోనే సిరాజ్ హడలెత్తించాడు.ఇన్నింగ్స్ లో రెండో బంతికే ఓపెనర్ అథర్వ (4) ను అవుట్ చేశాడు.తర్వాత లివింగ్ స్టోన్( Liam Livingstone ) రెండు పరుగులు చేసి సిరాజ్ చేతులో అవుట్ అయ్యాడు.

మహమ్మద్ సిరాజ్ తో పాటు హసరంగ ఇంకా ఇతర బౌలర్లు రాణించడంతో 24 పరుగుల తేడాతో బెంగుళూరు జట్టు ఘనవిజయం సాధించింది.నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

అంతేకాకుండా మహమ్మద్ సిరాజ్ ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లలో 24 ఓవర్లు బౌలింగ్ వేశాడు.ఇందులో 81 డాట్ బాల్స్ ఉన్నాయి.ఇప్పటివరకు ఈ సీజన్లో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్ గా మహమ్మద్ సిరాజ్ మొదటి స్థానంలో నిలిచాడు.ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో సిరాజ్ మొదటి స్థానంలో ఉన్నాడు.

తర్వాతి స్థానాలలో మహమ్మద్ షమీ( Mohammed Shami ) (65), జోసెఫ్ (48), మార్క్ ఉడ్ (48), అర్షదీప్ (45), భువనేశ్వర్ (45), రషీద్ ఖాన్ (45) ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube