Singer Usha : యాంకర్ సుమ వల్లే డబ్బులను ఎలా డిమాండ్ చేయాలో నేర్చుకున్న : సింగర్ ఉష

టీఎన్‌ఆర్ ( TNR )గా పాపులర్ అయిన యాంకర్ కమ్ యాక్టర్ తుమ్మల నాగేశ్వరరావు అకాల మరణం చెంది చాలామందిని శోకసంద్రంలో ముంచాడు.2021లో కరోనా కారణంగా చనిపోయిన టీఎన్‌ఆర్ ను ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేకపోతున్నారు.ముఖ్యంగా అతడి “ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్‌ఆర్” ఇంటర్వ్యూస్ మిస్ అవుతున్నారు.చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యాక్టర్ 50 ఏళ్లు నిండకముందే అందరినీ వదిలేసి వెళ్లిపోయాడు.

 Singer Usha About Anchor Suma Money Handling-TeluguStop.com

ఇతడు బతికున్నప్పుడు సింగర్ ఉషను చేసిన ఇంటర్వ్యూ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ గురించి సింగర్ ఉష ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

దానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొడుతోంది.సింగర్ ఉష గురించి స్పెషల్ గా పరిచయం అక్కర్లేదు.“నీ స్నేహం( Nee Sneham )” సినిమాలోని “చినుకు తడికి” పాట అద్భుతంగా ఆలపించి ప్రేక్షకుల హృదయాలను దోచేసింది సింగర్ ఉష.

Telugu Anchor Suma, Nee Sneham, Usha, Tollywood-Movie

అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో అడ్వాన్స్ ఇస్తేనే పాట పాడుతానని సింగర్ ఉష( Singer usha ) చాలా డిమాండ్ చేసేదని అప్పట్లో రూమర్స్ వచ్చాయి.ఆ రూమర్ గురించి స్పందించాలంటూ టీఎన్ఆర్ స్ట్రైట్ గా అడిగేసాడు.దాంతో అది కేవలం ఒక అబద్ధం మాత్రమేనని సింగర్ ఉష చెప్పుకొచ్చింది.“పేమెంట్ ఎక్కువ ఇస్తే సంతోషంగా తీసుకునేదాన్ని, ఒకవేళ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే వారు ఎంత ఇచ్చినా అభ్యంతరం తెలపకుండా తీసుకునే దాన్ని” అని చెప్పింది.

Telugu Anchor Suma, Nee Sneham, Usha, Tollywood-Movie

“ఎంత ఇస్తే అంత తీసుకోవాలనే మంచి లక్షణాన్ని యాంకర్ సుమ నుంచి నేర్చుకున్నాను.ఆమె చాలా బ్యాలెన్స్డ్‌ పర్సన్.నేను పాటలు పాడే సమయంలో, కచేరీలు, ఇతర కార్యక్రమాలు చేసేటప్పుడు సుమతో కలిసి చాలా కాలం ట్రావెల్ చేశాను.

ఆమెతో మంచి అనుబంధంగా ఉండేది.అప్పుడే సుమ చాలా ఎక్కువ పేమెంట్ తీసుకున్న సందర్భాలే కాక ఫ్రీగా కూడా యాంకరింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయని తెలుసుకున్నాను.సుమ ఎప్పుడూ ఒకటే చెప్తుండేది.‘మనం ఒకసారి పని చేస్తే వారు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు.’ అని చెప్పేది.ఆ మాట చాలా గొప్పది నాకు బాగా నచ్చింది.

అందుకే అదే నేను కూడా ఫాలో అయ్యాను.ఎప్పుడూ ఎక్కడా పేమెంట్ కోసం డిమాండ్ చేయలేదు.నేను కేవలం అడ్వాన్స్ తీసుకొని ఆ తర్వాత ఎలాంటి డబ్బు పొందని సందర్భాలు ఎన్నో ఉన్నాయి.” అని సింగర్ ఉష చెప్పుకొచ్చింది.సుమ గురించి ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube