షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) హీరోగా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన జవాన్ మూవీ( Jawaan movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించింది.
అయితే జవాన్ మూవీకి సంబంధించి అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు.జవాన్ సినిమాకు సంబంధించి ఒక టికెట్ కొనుగోలు చేస్తే మరో టికెట్ ను ఉచితంగా పొందే అవకాశం అయితే ఉంది.
మూవీ టీం నుంచి ఈ ఆఫర్ కు సంబంధించిన ప్రకటన వెలువడింది.
ఈరోజు నుంచి ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఆఫర్ అందుబాటులో ఉండగా ఇప్పటివరకు ఈ సినిమాను చూడని వాళ్లు ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
ఇప్పటికే ఈ సినిమాను చూసిన వాళ్లు కూడా మళ్లీ చూడాలని అనుకుంటే ఈ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.ఇప్పటికే ఈ సినిమా విడుదలై మూడు వారాలు కావడం, ఈ సినిమా కలెక్షన్లు తగ్గడంతో ఈ ఆఫర్ ను ప్రకటించారని సమాచారం అందుతోంది.
జవాన్ మూవీ ఆఫర్ వెనుక అసలు కథ ఇదేనని సమాచారం.ఈ ఆఫర్ వల్ల ఈ సినిమాకు ఏ స్థాయిలో మేలు జరుగుతుందో చూడాల్సి ఉంది. జవాన్ హిందీ వెర్షన్ కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించగా జవాన్ మూవీ ఇతర వెర్షన్లు మాత్రం మరీ భారీ రేంజ్ లో కలెక్షన్లు సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాయి.అట్లీ డైరెక్షన్ ( Atlee Direction )కావడంతో సౌత్ లో ఈ సినిమాకు పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.
పఠాన్, జవాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్ డుంకీ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నరు.షారుఖ్ ఖాన్ డుంకీ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.అయితే సలార్ సినిమాకు పోటీగా రిలీజ్ కానుండటంతో డుంకీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.