మన దేశంలోని వంట గదులలో ఉండే ముఖ్యమైన పదార్థాలలో నల్ల మిరియాలు( Black Pepper ) కూడా ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.వీటిని తగిన మోతాదులో ఉపయోగించడం వల్ల ఆహారానికి రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఏ వంటి పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేసే నల్ల మిరియాల లో ఉంటాయి.నల్ల మిరియాల లో ఉండే పోషకాలు కంటి సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
నల్ల మిరియాలు కళ్ళకు ఇంకా ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ఏ,సీ,ఈ విటమిన్లు అలాగే యాంటీ ఆక్సిడెంట్లు నల్ల మిరియాల లో పుష్కలంగా ఉంటాయి.ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.అలాగే వాటిని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇందులో ఉండే లుటీన్, జియాక్సంతిన్ కంటి పొడి, దురద సమస్యలను తొలగించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే నల్ల మిరియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, కామెర్లు( Jaundice ), ఎరుపు, కళ్ళ వాపు వంటి సమస్యలను దూరం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
అలాగే ఇందులో ఉండే క్యాప్సైసిన్( Capsaicin ) కంటి కండరాలను రిలాక్స్ చేసి కంటి అలసటను దూరం చేస్తాయి.ఇంకా చెప్పాలంటే నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల కంటి రక్త నాళాలు బలపడతాయి.ఈ నల్ల మిరియాలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే నల్ల మిరియాలను గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక చెంచా నెయ్యి, అర చెంచా పంచదార మిఠాయి వేసి బాగా కలపాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని త్రాగాలి.
దీన్ని ఎక్కువ సేపు తాగితే కంటి చూపు( Eye Sight )లో తేడా కచ్చితంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు
.