జూమ్ యాప్ వాడేవారికి షాక్.. ఆగస్ట్ నుంచి ఈ ల్యాప్‌టాప్‌లలో ఇది పనిచేయదు!

ప్రస్తుతకాలంలో వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ ఎంతగానో ప్రాచుర్యం పొందుతున్నాయి.కరోనా తరువాత ఇలాంటివాటికి మరింత డిమాండ్ ఏర్పడింది.

 Shock To Zoom App Users  It Will Not Work On These Laptops From August , Zoom Ap-TeluguStop.com

వాటిలో ముఖ్యమైనది Zoom App ఒకటి.ఈ అప్లికేషన్‌ను స్టూడెంట్స్ తో పాటుగా కార్పొరేట్ ఉద్యోగులు కూడా ఎక్కువగా వాడుతున్నారు.

ఆండ్రాయిడ్, IOS, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ ఇలా ప్రపంచవ్యాప్తంగా రకరకాల డివైజ్‌ల యూజర్లు దీనిని వాడుతున్నారు.అయితే ఈ ఆగస్ట్, 2022 నుంచి క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్‌లలో మాత్రం Zoom App అఫీషియల్ సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు తాజాగా కంపెనీ వెల్లడించింది.

Zoom App వాడే యూజర్లకు ఒక నోటిఫికేషన్ ప్రస్తుతం అందుతోంది.దీని అర్థం క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్‌లలో జూమ్ యాప్ సేవలు ఆగస్టు నుంచి నిలిచిపోయినా, వీడియో కాల్స్ కోసం జూమ్ ఫర్ క్రోమ్‌ PWA అనే జూమ్ వెబ్ యాప్‌ను యూజర్లు వినియోగించుకోవచ్చు.

క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్స్‌లో VLC, గూగుల్ కీప్, స్కైప్ వెబ్ వంటి క్రోమ్ యాప్‌ల సపోర్టు నిలిపివేసి, PWA యాప్స్‌కి మాత్రమే సపోర్ట్ ఇవ్వాలని Zoom అనుకుంటోంది.ఈ నేపథ్యంలోనే Zoom for Chrome PWA వాడాలని జూమ్‌ సంస్థ క్రోమ్‌బుక్ యూజర్లను కోరడం జరుగుతోంది.

Telugu August, Chromebook, Laptops, Latest, Latest Ups, Shock Zoom App, Conferen

గత సంవత్సరం లాంచ్ అయిన ఈ యాప్‌లో ఎన్నో యూజ్‌ఫుల్ ఫీచర్లను జూమ్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని పరిచయం చేసింది.ముఖ్యంగా, జూమ్ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్‌కు హై-ఎండ్ హార్డ్‌వేర్ అవసరం లేదు కనుక క్రోమ్‌బుక్ వినియోగదారులకు స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తోంది.అఫీషియల్ సపోర్ట్‌ ముగిసిన తర్వాత యూజర్లు కొద్ది రోజుల వరకు మాత్రమే జూమ్ యాప్‌ సేవలు పొందుతారని గుర్తు పెట్టుకోవాలి.అయితే ప్రస్తుత అప్డేట్ తో వారందరూ జూమ్ వెబ్ యాప్‌కి మారడమే ఉత్తమం అని విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube