శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తమిళ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావాల్సి ఉంది.కానీ శేఖర్ కమ్ముల సినిమా ప్రకటన తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమాను ప్రకటించిన ధనుష్ మొదట వెంకీ అట్లూరి దర్శకత్వంలోని సినిమాను చేయడం జరిగింది.
తెలుగు లో సార్ సినిమా తో గ్రాండ్ గా ధనుష్ ఎంట్రీ ఇచ్చాడు.శేఖర్ కమ్ముల సినిమా ఉందా లేదా అనే అనుమానాలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి.
శేఖర్ కమ్ముల యొక్క స్క్రిప్ట్ కు ధనుష్ మార్పులు చేర్పులు చెప్పాడని… అందుకే శేఖర్ కమ్ముల ఆ సినిమాను పక్కకు పెట్టాడని.తన స్క్రిప్ట్ కు మార్పులు చేసేందుకు శేఖర్ కమ్ముల ఆసక్తిగా లేడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
తాజాగా సార్ సినిమా తో ధనుష్ తెలుగు మరియు తమిళం లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.అందుకే శేఖర్ కమ్ముల యొక్క మనసు మార్చుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ సమయంలో ధనుష్ తో సినిమా ను చేస్తే శేఖర్ కమ్ముల యొక్క కెరీర్ కు కూడా చాలా ఉపయోగదాయకం అనడంలో సందేహం లేదు.అందుకే వెంటనే కాకున్నా కూడా కాస్త గ్యాప్ ఇచ్చి అయినా శేఖర్ కమ్ముల సినిమాను ధనుష్ తో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా ను చేసేందుకు ధనుష్ ఇంకా కూడా ఆసక్తిగా ఉన్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.తె