ఓ ఇంటివాడైన శర్వానంద్.. పెళ్లి ఫోటో రిలీజ్.. నెట్టింట వైరల్!

టాలీవుడ్ లో మరో యంగ్ హీరో ఓ ఇంటివాడయ్యాడు.ఇప్పటి వరకు బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్( Sharwanand ) ఇప్పుడు ఫ్యామిలీ మాన్ గా మారిపోయాడు.

 Sharwanand And Rakshitha Reddy Are Now Married, Sharwanand, Rakshitha Reddy, Sha-TeluguStop.com

గత రాత్రి శర్వానంద్ పెళ్లి తంతు ముగిసింది.తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి వైవాహిక బంధం లోకి అడుగు పెట్టాడు.

శర్వానంద్ రక్షిత మెడలో మూడు ముళ్ళు వేసాడు.

గత రెండు రోజుల క్రితమే శర్వానంద్ పెళ్లి వేడుకలు( Sharwanand Marriage Celebrations ) ఘనంగా మొదలయ్యాయి.జైపూర్ లోని లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి జరిగింది.ఇరు కుటుంబాల మధ్య రెండు రోజుల ముందు నుండే సంగీత్, మెహందీ అంటూ అన్ని వేడుకలను ఎంతో బాగా చేసారు.

మరి ఈ పెళ్లి వేడుకలకు ముఖ్య అతిథులు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించినట్టు తెలుస్తుంది.

రక్షిత రెడ్డి( Rakshitha Reddy ) మెడలో మూడు ముళ్ళు వేసి తన పెళ్లి తంతు శాస్త్రోక్తంగా ముగించారు.

మరి పెళ్ళికి సంబంధించిన ఫోటోను నెట్టింట షేర్ చేయడంతో ఆ పిక్ వైరల్ అవుతుంది.నూతన దంపతులు ఇద్దరు కలిసి దిగిన ఫోటోను విడుదల చేసారు.

ఈ పిక్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యింది.ఇదిలా ఉండగా ఈయన కెరీర్ విషయానికి వస్తే.


ఒకే ఒక జీవితం హిట్ తర్వాత ఈయన తన పంథా మార్చుకుని కొత్తగా కంటెంట్ ఉన్న సినిమాను ఎంచుకున్నాడు.ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఒక నవల ఆధారంగా తెరకెక్కుతుంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై ఈ సినిమా నిర్మితం అవుతుండగా పెళ్లి కారణంగా సినిమా షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube