తన పార్టీ పెట్టినప్పటి నుంచే తెలంగాణ రాజకీయాల పై మాత్రమే పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టిన షర్మిల( ys sharmila ) అక్కడ 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు.అధికార పార్టీ పై కేసీఆర్ పై డైరెక్ట్ టార్గెట్ చేసిన షర్మిల కొంత స్థాయి వరకు ప్రభావం చూపించగలిగినప్పటికీ తెలంగాణ ప్రజానీకం లో మాత్రం ఆమె నాన్ – లోకల్ అన్న ముద్ర మాత్రం చేరగలేదు.
దాంతో ఆమె ఆశించిన ప్రయోజనం నెరవేరకపోవడంతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని అయినా తెలంగాణలో గెలవాలని చూసిన ఆమె ఆశలపై రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వర్గం నీళ్లు చల్లింది .షర్మిలను చేర్చుకోవడం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువ అని పార్టీ పై ఆంధ్రా ముద్ర పడుతుందని అధిష్టానాన్ని ఒప్పించగలిగిన రేవంత్ .ఆమె కాంగ్రెస్లో చేరితే అభ్యంతరం లేదు కానీ ఆమె ఆంధ్ర రాజకీయాల వరకే పరిమితం చేయాలంటూ అధిష్టానానికి స్పష్టం చేశారు.
దాంతో పునరలోచనలో పడిన కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్యవర్తిత్వంతో ఒక మధ్య మార్గాన్ని అవలంబించినట్లుగా తెలుస్తుంది.కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిలను పంపించి కీలక పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ జాతీయ కమిటీలోకి తీసుకొని ఆమెను ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రయోగించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది.మొదట్లో ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెట్టడానికి ససేమిరా అన్న షర్మిల అనేక చర్చల తర్వాత చివరికి అంగీకరించినట్లుగా తెలుస్తుంది .తన ఓటు బ్యాంకు ను పూర్తిగా హస్తగతం చేసుకున్న జగన్( CM jagan ) పైకి ఇప్పుడు వైయస్ వారసురాలని ప్రయోగించడం ద్వారా తిరిగి ఆయా నేతలను వెనకకు తీసుకురావాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం 2024 ఎన్నికల్లో వైసీపీని బలహీనపరచి తెలుగుదేశం గెలిచేలా చూడాలంటూ షర్మిలకు స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.తద్వారా వైసిపి బలహీన పడుతుందని 2029 కల్లా కాంగ్రెస్ పుంజుకోవడానికి దారులు పడతాయి అన్నది కాంగ్రెస్ అధిష్టానం భావనగా తెలుస్తుంది.
అయితే తన రాజకీయ ఆసక్తులన్నీ తెలంగాణతో ముడిపడి ఉన్నప్పటికీ పరిస్థితి అనుకూలంగా లేని కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన ఈ ఈ రాజీమార్గానికి షర్మిల అంగీకరించారని వార్తలు వస్తున్నాయి మరి షర్మిల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి
.