హీరోగా మంచి అవకాశాలు వచ్చిన వాళ్ళు సినిమాలు చేసుకుంటూ ఉండవచ్చు కానీ కొందరు మాత్రం అవకాశాలు వచ్చినప్పటికి సినిమాల నుండి దూరం గా ఉంటారు అలాంటి వాళ్లలో హీరో నవదీప్( Navdeep ) ఒకరు ఆయన కి హీరో గా ఇప్పటికీ కుస్ మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఆయన సినిమా లు చేయడానికి చాలా బద్దకం గా ఉంటాడని తెలుస్తుంది…

ఇక మొదట్లో ఈయన చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి అలాగే ఇప్పటికీ ఈయనకి మంచి సినిమాలు వచ్చినప్పటికీ ఆ సినిమాలు చేయకుండ ఏవేవో సినిమాలు చేస్తూ కాలాన్ని అలా గడుపుతున్నాడు ఆయన చేసిన సినిమాల్లో చాలా సినిమాలు అసలు డిజాస్టర్ గా మిగులుతాయి ఇక హీరో గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చాలా సినిమాలు చేస్తాడు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు…అయితే ఇన్ని సంవత్సరాలు గడిచిన కూడా ఆయన ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే నిజానికి నవదీప్ లైఫ్ ను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు…చాలా పార్టీలు కూడా కండక్ట్ చేస్తూ అల్లు అర్జున్ లాంటి హీరో ని ఆ పార్టీ కి ఇన్వైట్ చేస్తాడు అనే విషయం కూడా తనే చాలా సార్లు చెప్పాడు…ఇలా పార్టీలకి అలవాటైన వాడు ఇంట్లో ఫ్యామిలీ కి టైం స్పెండ్ చేయడం చాలా కష్టం అందుకనే ఆయన పెళ్లి అనే మాట కూడా ఎత్తడం లేదు…ఇక సినిమా లు అంటే ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు…

ఇక ఈయన మొదట్లో చేసిన జై, గౌతమ్ ఎస్ ఎస్ సి( Gowtam SSC ) గానీ కృష్ణ వంశీ దర్శకత్వం లో వచ్చిన చందమామ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విషయాలను అందుకున్నాయి…అందుకే ఆయన చేసిన చాలా సినిమాలు ఇక్కడ సూపర్ హిట్ అయ్యాయి అని ట్రేడ్ పండితులు కూడా వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…నిజానికి నవదీప్ మంచి హీరో మెటీరియల్ ఉన్న వ్యక్తి కావడం తో ఈయన వరుసగా సినిమాలు చేసుకుంటూ ఉండచ్చు కదా అని సినీ పెద్దలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…నిజానికి క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన గమ్యం సినిమా( Gamyam ) నవదీప్ చేయాల్సిందే కానీ ఇలాగే పార్టీ లు పబ్ లు అంటూ తిరుగుతూ నెగ్లెట్ చేయడం తో క్రిష్ శర్వానంద్ ని పెట్టీ ఈ సినిమా తీసి మంచి విజయం అందుకున్నాడు…