మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేత ఎన్సిపి అధినేత శరద్ పవార్( Sharad Pawar ) రాజీనామా నిర్ణయం పై వెనక్కి తగ్గారు.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల కమిటీ తీర్మానం మేరకు రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
రెండు రోజుల క్రితం ఎన్సీపీ చీఫ్ పదవి( NCP Chief )కి రాజీనామా చేస్తున్నట్లు శరద్ పవార్ సంచలన ప్రకటన చేయడం జరిగింది.కాగా ఇవ్వాళ దీనిపై పార్టీ సీనియర్ల ఒత్తిడి మేరకు వెనక్కి తగ్గటం జరిగింది.
మహారాష్ట్రలో పార్టీ కేడర్( Maharashtra Party Cadre ) నుండి వస్తున్న నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శరద్ పవార్ స్పష్టం చేశారు.అంతకుముందు ఒక్కసారిగా పవార్ రాజీనామా చేయటంతో కాంగ్రెస్, శివసేన పార్టీలు షాక్ అయ్యాయి.
ఏ కారణంగా పవార్ రాజీనామా చేశారు అన్నది వారికి క్లారిటీ లేదు.
ఈ క్రమంలో మళ్లీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్లు సాయంత్రం శరద్ పవార్ ప్రకటించటం జరిగింది.ఈ పరిణామంతో మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మార్పు చెందింది.
ఎందుకంటే శివసేన పార్టీని చీల్చి బీజేపీతో జతకట్టి ముఖ్యమంత్రి అయిన ఏకనాథ్ షిండే( Eknath Shinde ) విషయంలో త్వరలో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.కచ్చితంగా ఏకనాథ్ షిండే పదవి పోయే అవకాశం ఉందని ప్రచారం మొదలయ్యింది.
ఈ క్రమంలో బీజేపీ … పక్క చూపులు చూస్తున్నట్లు ఎన్సీపీని చీల్చే కుట్ర జరిగినట్లు ప్రచారం కూడా జరిగింది.దీంతో బీజేపీ కుట్రలకు బ్రేక్ వేయడానికే శరద్ పవార్… ఈ రాజీనామా డ్రామాకి తెరలేపినట్లు మహారాష్ట్ర మీడియాలో వార్తలు వస్తున్నాయి.