అగ్ర రాజ్యం అమెరికాని బాంబు పార్సిల్స్ తెగ కలవర పెడుతున్నాయి.కొన్ని రోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకి ఆయన ప్రభుత్వంలో ఉన్న హిల్లరీ కి కూడా బాంబు పార్సిల్స్ వచ్చిన విషయం విదితమే.
ఈ సంఘటనలు అమెరికాలో సంచలనం సృష్టించాయి.తాజాగా కొంతమంది ప్రముఖులకి కూడా ఈ తరహా పార్సిల్స్ వచ్చాయి వారిలో
భారత సంతతికి చెందిన సెనెటర్ కమలా హారిస్ కి కూడా ఈ పార్సిల్ వచ్చింది.
అలాగే డెమోక్రటిక్ పార్టీకి చెందిన బిలియనీర్ టామ్ స్టెయర్.నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ జేమ్స్ క్లాపర్ ఇళ్లకు వచ్చిన పార్శిల్ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) వెల్లడించింది.దీంతో ఈ పార్శిల్ బాంబుల సంఖ్య 14కు చేరినట్లు తెలిపింది…అయితే ఇప్పటికే ఈ ఘటనలకి సంభందించి ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
.తాజా వార్తలు