సావిత్రి రేర్ పిక్ వైరల్.. అప్పట్లోనే విదేశాల నుండి ఆమె కోసం అభిమానులు..

మహానటి సావిత్రి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతియసోక్తి కాదేమో.ఎందుకంటే సావిత్రి పాత హీరోయిన్ అయినా కూడా ఆమె గురించి, ఆమె నటన ప్రతిభ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.

 Savitri Rare Photo With Malaysian Fans In Saree Photo Viral On Social Media, Sav-TeluguStop.com

ఈమె కళ్ళతోనే నవ రావరసాలు పలికించ గలిగే అరుదైన నటి.భారత చలన చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.

సావిత్రి చిన్న వయసులోనే మరణించిన విషయం మనకు తెపిసిందే .సావిత్రిని గుర్తు చేసుకొని సినీ ప్రేక్షకులు లేరు.ఈమె నటన గురించి మాత్రమే కాదు.ఈమె జీవితంలో జరిగిన విషయాల గురించి కూడా ఇప్పటికి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు.ఆమె జీవితం ఏ విధంగా ముగిసింది.ఎలా ఆమె మోసపోయింది.

ఆమె ఆస్థి అంత ఎలా పోగొట్టుకుంది.ఇలా ఈమె గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి వీటిని కూడా తలచుకుంటునే ఉంటారు.

Telugu Malaysian Fans, Rare, Savitri, Savitrirare-Movie

అలాగే సావిత్రి కి సంబంధించిన ఎన్ని ఫోటోలు వచ్చిన అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.తాజాగా సావిత్రి ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.అప్పట్లోనే సావిత్రిని కలవడానికి విదేశాల నుండి అభిమానులు ఆమె కోసం వచ్చేవారిని ఈ ఫోటో ద్వారా తెలుస్తుంది.1962లో తమ అభిమాన నటి అయినా సావిత్రిని కలవడానికి మలేషియా నుండి కొంత మంది మహిళా అభిమానులు వచ్చారు.

Telugu Malaysian Fans, Rare, Savitri, Savitrirare-Movie

అప్పుడు మహానటి సావిత్రి తన అభిమానులతో తీసుకున్న అరుదైన ఫోటో.ఫ్యాన్స్ ను ఆకర్షిస్తుంది.ఆ ఫొటోలో మలేషియా అభిమానులు కూడా మన భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా చీరలు కట్టుకుని సావిత్రి తో ఫోటోలు తీయించు కున్నారు.ఈ అరుదైన ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అప్పట్లో ఇంత టెక్నాలిజీ సోషల్ మీడియా ఇవేమీ లేకుండానే ఆమె కోసం విదేశాల నుండి ఫ్యాన్స్ వచ్చారంటే సావిత్రి రేంజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube