మహేష్ ని దాటలేకపోయిన పవన్

సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు … ఇలాంటి నిత్యసత్యం మరోకటి చెప్పమంటే మహేష్ బాబు ఓవర్సీస్ కింగ్ అని చెప్పొచ్చెమో.మొన్న బ్రూస్ లీ, ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ … పనిగట్టుకోని మెగాఫ్యామిలి ఓవర్సీస్ లో మహేష్ సినిమాలకి మించి రిలీజ్ చేసుకొని చేతులో కాల్చుకుంది.

 Sardaar Fails To Beat Srimanthudu Overseas Premiers-TeluguStop.com

అమెరికా ప్రీమియర్స్ లో శ్రీమంతుడు పేరిట ఉన్న రికార్డుని అవలీలగా కొడుతుంది సర్దార్ గబ్బర్ సింగ్ అని ఆశపడ్డ అభిమానులకి నిరాశే మిగిలింది.శ్రీమంతుడు పక్కనపెడితే, ఆగడు ప్రీమియర్స్ ని కూడా కొట్టేలా లేదు సర్దార్ గబ్బర్ సింగ్

ప్రస్తుతం సర్దార్ నడుస్తున్న స్పీడ్ కి 5 లక్షల డాలర్ల దరిదాపుల్లోకి వచ్చేలా ఉంది ప్రీమియర్స్ కలెక్షన్లలో.

ఆగడు 5 లక్షల 29వేల డాలర్లు కలెక్ట్ చేస్తే, శ్రీమంతుడు 5 లక్షల 55 వేల డాలర్లు రాబట్టింది ప్రీమియర్స్ ద్వారా.ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఆగడు, శ్రీమంతుడు చిత్రాల కన్నా, సర్దార్ గబ్బర్ సింగ్ అమెరికాలో చాలా పెద్ద రిలీజ్, పైగా టికెట్ రేట్లు చాలా పెంచేశారు

ఈ లెక్కన బ్రహ్మోత్సవం సమయంలో తన ఓవర్సీస్ ప్రీమియర్స్ రికార్డులని తానే బద్దలు కొట్టుకోవాలి మహేష్ బాబు.

అవును .ఇంకో విషయం చెప్పడం మరిచితిమి.ఈ రికార్డులన్ని బాహుబలిని లెక్కలోకి తీసుకోకుండా చెబుతున్నవి.బాహుబలి ఓవర్సీస్ ప్రీమియర్స్ రికార్డులు దాటడం .ఇప్పట్లో మహేష్ బాబు వల్ల కూడా అయ్యే పని కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube