అమెరికాలో “సంపదను” సృష్టిస్తున్న “సంపద”

సంపద.సంపదని సృష్టించడం ఏమిటి అనుకుంటున్నారా.సంపద అంటే కేవలం ధనంతో కూడుకున్నది మాత్రమే కాదు.జ్ఞానంతో కూడినది.ఇదే అసలైన సంపద.అమెరికాలో ఉంటున్న సిలికానాంద్ర మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్ అండ్ డ్యాన్స్ అకాడమీ ని షార్క్ కట్ లో సంపద అంటారు.

 Silicon Andhra Music, Performing Arts & Dance Academy, Sampada, Overseas Studen-TeluguStop.com

ఈ సంపద సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.భాతీయులకి అసలు సిసలు సంపద మన సనాతన సాప్రదాయాలు, సంగీతం, నాట్యం ఇవే అసలు సిసలు సంపద అంటారని చెప్తుంది.

కరోనా సమయంలో ఇళ్ళ వద్ద ఉంటున్న ఎన్నారైలకి మన సంస్కృతిలో భాగాలైన సంగీతం, నాట్యం వంటి వాటిలో శిక్షణ ఇస్తోంది.

తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా విదేశాలలో ఉంటున్న ఎన్నారైలకి వారి పిల్లలకి కూచి పూడి, భారత నాట్యం, శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇస్తోంది.

ఈ శిక్షణలో ఉత్తీర్ణులు అయిన వారికి జూనియర్ , సీనియర్ అనే కేటగిరీలో సర్టిఫికెట్ లు అందిస్తున్నారు.ఈ ఏడాది లో సుమారు 1500 మంది విద్యార్ధులు హాజరుకాగా వారికి శిక్షణ అనంతరం సర్టిఫికెట్ లు ఇచ్చినట్టుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు.

సంపద ద్వారా తాము సంగీతం, నాట్యంలో శిక్షణ పొందామని ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేశారు.ఇదిలాఉంటే

వచ్చే విద్యా సంవసత్సరానికి గాను ఈ శిక్షణలో చెరదలిచిన వారు

https://sampada.siliconandhra.org/

వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.కరోనా సమయంలో తాము చేపట్టిన కార్యక్రమాలకి విశేషమైన స్పండిన వచ్చిందని సంస్థ నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి సహకరించిన ఎన్నారైలు, సంస్థ సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు సంస్థ అధ్యక్షులు దీన బాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube