మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ).పెళ్లి వేడుకలు ఇటలీలో మొదలైన సంగతి మనకు తెలిసింద.
వీరిద్దరూ నవంబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒకటి కానున్నారు.ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహ వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభం అయ్యాయి ఇకపోతే వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి పెళ్లిలో కూడా కొంతమంది సెలబ్రిటీలు హాజరు కాబోతున్నట్టు సమాచారం .వరుణ్ లావణ్య ఇద్దరికీ చాలా సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీలను ఆహ్వానించినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి వేడుకలలో భాగంగా హీరో నితిన్( Nithin ) తన ఫ్యామిలీతో ఇటలీ చేరుకొని వరుణ్ పెళ్లి వేడుకలలో భాగమైన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా వీరి పెళ్లి వేడుకలలో మాజీ సెలెబ్రెటీ కపుల్స్ కూడా సందడి చేయబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇండస్ట్రీలో సెలబ్రెటీ కపుల్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత( Samantha )నాగచైతన్య ( Nagachaitanya ) విడాకులు తీసుకొని విడిపోయారు.
అయితే వీరిద్దరూ వరుణ్ పెళ్లిలో ఎదురు పడబోతున్నారని తెలుస్తుంది.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటికి సమంత నాగచైతన్య ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు కావడంతో వీరిద్దరిని కూడా తమ పెళ్ళికి ఆహ్వానించారట.ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య ఇద్దరు కూడా వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల కోసం ఇటలీ వెళ్లారని తెలుస్తోంది.ఈ పెళ్లి వేడుకలలో భాగంగా మొదటిసారి వీరిద్దరూ ఎదురు పడిపోతున్నారని తెలుస్తుంది.
ఇలా వీరిద్దరూ ఎదురుపడగా ఒకరినొకరు పలకరించుకుంటారా లేదా అన్న విషయంపై కూడా అభిమానులలో ఆత్రుత నెలకొంది.