నేడే SAFF ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్.. కువైట్ తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్..!

సౌత్ ఏషియన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్( SAFF Championship ) ఫైనల్ మ్యాచ్ కువైట్-భారత్ మధ్య బెంగుళూరులోని కంఠీరవం స్టేడియంలో నేడు జరగనున్న సంగతి తెలిసిందే.సునీల్ ఛెత్రీ సారథ్యంలో భారత ఫుట్ బాల్ జట్టు మరోసారి టైటిల్ పై గురి పెట్టింది.

 Saff Championship Final Match Today India Will Decide Against Kuwait-TeluguStop.com

ఇప్పటికే భారత్ ఎనిమిది సార్లు టైటిల్ గెలిచి తొమ్మిదో సారి టైటిల్ గెలిచేందుకు బరిలోకి దిగింది.

సునీల్ ఛెత్రీ( Sunil Chhetri ) సారథ్యంలో లెబనాన్ తో సెమీ ఫైనల్ లో పెనాల్టీ సూట్ అవుట్ లో విజయం సాధించి భారత ఫుట్ బాల్ జట్టు ఫైనల్ కు చేరింది.ఈ టోర్నీ లీగ్ దశలో భారత్-కువైట్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1 తో డ్రాగా ముగిసింది.ఈ స్లో టీం ఇండియా ఆదిత్యం సాధించిన సెల్ఫ్ గోల్ కారణంగా విజయం సాధించలేక పోవడంతో.

ఫైనల్ మ్యాచ్లో కాస్త దూకుడుగా ఆడి టైటిల్ గెలవాలని పట్టుదలతో భారత్ ఉంది.అయితే ప్రస్తుతం ఆశలన్నీ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ పైనే.ఎందుకంటే లీగ్ దశలో మూడు మ్యాచ్లలోనూ గోల్స్ కొట్టి జట్టును గెలిపించాడు.లెబనాన్ ( Lebanon )జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయంలో బంతిని లక్ష్యాన్ని చేర్చలేక పోయాడు.

కానీ మ్యాచ్లో చెలరేగి అద్భుత ఆటను ప్రదర్శిస్తాడని భారత్ జట్టు కెప్టెన్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.

మరొకవైపు భారత జట్టులోకి కీలక డిపెండర్ సందేశ్ చేరడం భారత్ కు బలాన్ని పెంచింది.ఇతను అన్వర్ అలీ స్థానంలో బరిలోకి దిగనున్నాడు.అంతేకాకుండా జట్టులో ఉదాంత సింగ్ ఫుల్ ఫామ్ కొనసాగిస్తున్నాడు.

భారత జట్టు ఎంత బలంగా ఉన్న కువైట్ జట్టుతో పోరు అంత సులువేం కాదు.ఆ జట్టు డిఫెన్స్ ను చేదించడం భారత్ కు అతిపెద్ద సవాల్.

కాకపోతే భారత్ 2005 తర్వాత స్వదేశంలో జరిగిన ఏ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో ఇంతవరకు ఓడిపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube