విజయ్ లో నాకు నచ్చేది ఆ ఒక్కటే...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలందరి తో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల లో తమన్నా( Tamanna ) ఒకరు…దాదాపు రెండు ద‌శాబ్దాల నుంచి ఇండ‌స్ట్రీలో కెరీర్ ను కొనసాగిస్తున్న త‌మ‌న్నా.ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసింది.

 Tamanna Revealed In A Relationship With Vijay Varma , Vijay Varma , Tamanna ,-TeluguStop.com

ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించింది.హీరోల‌తో స‌మానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది.

ఇప్ప‌టికీ వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్న ఈ బ్యూటీ.బాలీవుడ్ లో హీరోగా ఇప్ప‌డిప్పుడు ఎదుగుతున్న విజ‌య్ వ‌ర్మ‌( Vijay Varm )తో ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

 Tamanna Revealed In A Relationship With Vijay Varma , Vijay Varma , Tamanna ,-TeluguStop.com
Telugu Bollywood, Lust, Tamanna, Tollywood, Vijay Varma, Web-Movie

రీసెంట్ గా వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2 ( Lust Stories 2 )అనే వెబ్ సిరీస్ లో నటించారు.ఈ సిరీస్ షూటింగ్ స‌మ‌యంలో విజ‌య్ వ‌ర్మ‌, త‌మ‌న్నా మ‌ధ్య ప్రేమ చిగురించింది.ఈ ఏడాది వీరిద్ద‌రూ న్యూ ఇయ‌ర్ వేడుకుల‌ను జంట‌గా గోవాలో
సెల‌బ్రేట్ చేసుకున్నారు.అప్ప‌టి నుంచి విజ‌య్ వ‌ర్మ‌, త‌మ‌న్నా మ‌ధ్య సమ్‌థింగ్ స‌మ్‌థింగ్ అంటూ వార్త‌లు ఊపందుకున్నాయి…

Telugu Bollywood, Lust, Tamanna, Tollywood, Vijay Varma, Web-Movie

ఫైన‌ల్ గా ఆ వార్త‌ల‌నే నిజం చేస్తూ త‌మ‌న్నా విజ‌య్ వ‌ర్మ‌( Vijay varma ) తో రిలేష‌న్ లో బ‌య‌ట‌పెట్టింది.తామిద్ద‌రం ప్రేమ‌లో ఉన్నామ‌ని ఒప్పేసుకుంది.అయితే విజ‌య్ లో ఏ క్వాలిటీ న‌చ్చి త‌మ‌న్నా ల‌వ్ చేసిందో తెలుసా.

స్ట్రీల‌కు అత‌డిచ్చే గౌర‌వం అట‌.ఈ సీక్రెట్ ను త‌మ‌న్నా స్వ‌యంగా రివీల్ చేసింది.తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మిల్కీ బ్యూటీ.ప్రియుడిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.విజయ్ వర్మ నా లైఫ్ లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.అత‌ను నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు.

గౌరవిస్తాడు.తన కుటుంబంలోని స్త్రీలపై ఎంతో ప్రేమాభిమానాలను చూపుతాడు.

బయట మహిళలతో కూడా చాలా మర్యాదగా వ్యవహరిస్తాడు.ఇది నేటితరం యువత నేర్చుకోవాలి.

ప్రతి విషయంలో మహిళలు రాజీపడాలనే భావ‌న‌ను నేను అంగీకరించను.విజయ్ నా అభిప్రాయాలను గౌరవిస్తాడు.

అందుకే అత‌డు నా మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌య్యాడు` అంటూ త‌మ‌న్నా చెప్పుకొచ్చింది.మ‌రి పీక‌ల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట పెళ్లి పీట‌లెప్పుడు ఎక్కుతారో చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube