మనం వివిధ పనుల కోసం బయటకు వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, నగరాలలో ఉండే ప్రధాన కూడల్ల వద్ద అడుక్కునే బిచ్చగాళ్లను చూసే ఉంటాం.బిచ్చగాళ్లు రకరకాలుగా అడుక్కుంటూ ఉంటారు.
కొందరు పాటలు పాడుతూ అడుక్కుంటే, కొందరు చేతిలో ప్లేట్ పట్టుకొని అడుక్కుంటారు.లేదంటే చేతులు చాపి బిక్షం అడుక్కుంటారు.
అలాంటి వారిని బయట ప్రపంచంలో చూస్తూనే ఉన్నాం.
ప్రస్తుతం డిజిటల్( Digital ) యుగం నడుస్తోంది.
కరోనా అనంతరం చిన్న మొత్తంలో లావాదేవీలు అన్ని డిజిటల్ రూపంలోనే జరగడం ప్రారంభమయ్యాయి.దీంతో బిచ్చం అడిగితే చిల్లర లేదు అని అంటూ ఉండడంతో బిచ్చగాళ్లు కూడా అడుక్కునే స్టైల్ మార్చేసి అప్డేట్ అయ్యారు.
కాలానికి అనుగుణంగా అందరూ మారాల్సిందే అంటూ ఓ బిచ్చగాడు రైల్లో అడుక్కుంటున్న స్టైల్ ను చూసే వారంతా ఆశ్చర్యపోతున్నారు.

ఓ బిచ్చగాడు చేతిలో క్యూఆర్ కోడ్( QR code ) తో ప్రజల వద్ద భిక్షాటన చేస్తున్న దృశ్యాలను ఓ వ్యక్తి రికార్డ్ చేసి, ఆ వీడియో ను సోషల్ మీడియా( Social media )లో అప్లోడ్ చేశాడు.ఆ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా అడుక్కునే వాళ్లకు చిల్లర, తినే వస్తువులు బిక్షం వేస్తారు.ప్రస్తుతం డిజిటల్ యుగం కావడంతో ఎవరి జోబులో కూడా చిల్లర ఉండడం లేదు.దీంతో ఓ బిచ్చగాడు రైలు ఎక్కి క్యూఆర్ కోడ్ ను చేతిలో పట్టుకోని అందరిని బిక్షం వేయాలని పాటలు పాడుకుంటూ అడుక్కుంటూ ఉండడం అక్కడ ఉండే వారందరినీ నోరేళ్ల బెట్టేలా చేసింది.
ఈ వీడియో ముంబైలోని ట్రైన్ లో తీసినట్లు సమాచారం.సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజు ఎన్నో కొత్త రకాల వీడియోలు చూసేవారందరినీ ఆశ్చర్యపరిచి నోరేళ్ల బెట్టేలా చేస్తున్నాయి.







