వైరల్: తండ్రి ముందే కొడుకును అత్యంత దారుణంగా చంపి తినేసిన షార్క్!

షార్క్ ( Shark ) కన్నతండ్రి ముందే కొడుకును అత్యంత దారుణంగా చంపి తినేసిన దిగ్భ్రాంతికర ఘటన ఈజిప్ట్ లో( Egypt ) చోటుచేసుకుంది.సరదాగా సముద్రంలో సేదతీరుదాం అనుకున్న ఆ వ్యక్తి సొరచేప దాడిలో( Shark Attack ) ప్రాణాలు వదలడం స్థానికంగా కలకలం రేపింది.

 Russian Tourist Eaten By Tiger Shark In Front Of Father Details, Viral News, Vir-TeluguStop.com

ఈ క్రమంలో తన ప్రాణాలు కాపాడుకోవడానికి చివరి క్షణం వరకు బాధితుడు విశ్వ ప్రయత్నం చేసాడు.కానీ ఆ మాయదారి షార్క్ నుంచి తప్పించుకోలేకపోయాడు.

ప్రాణాల కాపాడాలని తండ్రిని ఎంత కోరినా అతని ఆవేదన అరణ్య రోదనగానే మిగిలింది.ఈ ఘటన ఈజిప్ట్ లోని ప్రసిద్ధ రిసార్ట్ అయిన హుర్ఘదాలో జరిగింది.

ఈ ఘటనలో రష్యాకు చెందిన 23 ఏళ్ల టూరిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు.జనాలు చూస్తుండగానే అతని ప్రాణాలు పోయాయి.ఆ సాగర తీరం వద్ద నిలబడి ప్రజలు చోద్యం చూసినట్టు చూసారే తప్ప ఏం చేయలేని పరిస్థితి.క్షణాల వ్యవధిలో ఆ టైగర్ షార్క్ ఆ యువకుడిపై పలుమార్లు దాడి చేసింది.

బాధిత యువకుడిని వ్లాదిమిర్ పోపోవ్ గా( Vladimir Popov ) గుర్తించారు.ఒడ్డున ఉన్న తన తండ్రి కోసం ”పాపా.పాపా” అంటూ తనను కాపాడాలని కోరినా లాభం లేకుండా పోయింది.ఒడ్డున ఉన్న తండ్రి ఈ షాకింగ్ ఘటనకు నిశ్చేష్టుడై చూశాడు తప్పితే, కొడుకును కాపాడుకునేందుకు ఏం చేయలేకపోయాడు పాపం.

అక్కడ ఉన్న వారంతా షార్క్ దాడిని కెమెరాల్లో బంధించడంలో ఉత్సాహం చూపించారు గానీ, కాపాడలేకపోయారు.ఇక ఈ ఘటన నుంచి పోపోవ్ ఫ్రెండ్ తృటితో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది.ఈ ఘటనతో సముద్రపు నీళ్లు ఎరుపురంగు పూసుకున్నాయి.ఈ ఘటనతో అప్రమత్తం అయిన హోటల్ సిబ్బంది ఎమర్జెన్సీ అలారాన్ని మోగించి, వెంటనే సముద్రంలో నుంచి బయటకు రావాలని కోరారు.

తమ కళ్లముందే యువకుడిని షార్క్ చంపి తినేసిందని, సమీపంలో ఈత కొడుతున్న మరికొందరు తెలియజేసారు.కాగా ఈ ఘటనతో అక్కడికి వెళ్లిన టూరిస్టులు భయభ్రాంతులకు గురయ్యారు.అయితే ఆ షార్క్ ను పట్టుకున్నట్లు ఈజిప్ట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది.టైగర్ షార్క్ ని పరిశోధించడానికి ప్రయోగశాలకు తీసుకెళ్లామని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube