వరల్డ్ లోనే బిగ్గెస్ట్ స్క్రీనింగ్ కు రెడీ అవుతున్న 'ఆర్ఆర్ఆర్'!

ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పేరు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువుగా వినిపిస్తుంది.

 'rrr' To Be Screened In World's Biggest Theatre In Usa, Rrr, Ram Charan, Tolly-TeluguStop.com

అందుకు కారణం ఈ సినిమా ఆస్కార్ కు ఎంపిక కావడమే.అంతేకాదు ఆస్కార్ కంటే ముందుగానే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను సైతం మన ఆర్ఆర్ఆర్ సినిమా తన ఖాతాలో వేసుకుంటూ అనునిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.

మరి ఇలాంటి సినిమాను మన తెలుగు డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేయడం విశేషం.

రౌద్రం రణం రుధిరం సినిమాను అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసాడు.

ఈ సినిమా గత ఏడాది మర్చి 25న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని నమోదు చేసింది.ఇండియన్ సినిమా గర్వించదగ్గ సినిమాగా ఆర్ఆర్ఆర్ చరిత్రకెక్కింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది.

ప్రపంచ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించిన ఈ సినిమాలో చార్ట్ బస్టర్ గా నిలిచిన ‘నాటు నాటు’ సాంగ్ ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం ఆస్కార్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే.దీంతో ఈసారి మన ఇండియన్ ప్రేక్షకులంతా ఆస్కార్ అవార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా ముందు నుండి యూఎస్ లో సత్తా చాటుతూనే ఉంది.

అక్కడ ఆర్ఆర్ఆర్ పేరు వినిపిస్తూనే ఉంది.ఈ భారీ సినిమా ఇప్పుడు ప్రపంచం లోనే అతి పెద్ద స్క్రీనింగ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.యూఎస్ లోని ఏస్ హోటల్ థియేటర్ లో ఈ సినిమా భారీ స్క్రీనింగ్ జరుగుతున్నట్టు టాక్.మొత్తంగా 1647 సీటింగ్ కెపాసిటీతో ప్లాన్ చేసిన మాసివ్ స్క్రీనింగ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల 30 నిముషాలకు బిగ్గెస్ట్ స్క్రీనింగ్ పడనుంది.

ఇది మొత్తం హౌస్ ఫుల్ కావడం సెన్సేషనల్ అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube