కొమ్మ ఉయ్యాలా.. కోన జంపాల పాట పాడిన చిన్నారి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25 వ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ దక్కించుకుంది.

 Rrr Movie Komma Uyyala Kona Jampala Song Singer Prakruthi Reddy Details,  Rrr Mo-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమాలో ఒక గిరిజన చిన్నారి పాడిన కొమ్మ ఉయ్యాలా…కోన జంపాల అనే పాట ద్వారా మొదలవుతుంది.ఈ పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి.

ఇకపోతే ప్రస్తుతం ఈ పాట పాడిన చిన్నారి గురించి పెద్ద ఎత్తున నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఈ పాట పాడిన చిన్నారి ఎవరు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే…

ప్రకృతి ఒడిలో సాగిపోయే తన బాల్యం గురించి మల్లీ పాడిన ఈ పాటను బళ్లారికి చెందిన 12 సంవత్సరాల ప్రకృతి రెడ్డి అనే చిన్నారి పాడింది.

బళ్లారిలో జన్మించిన ప్రకృతికి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం అది గ్రహించిన ఆమె తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఆమెకి సంగీతంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.ఒకవైపు చదువులు కొనసాగిస్తూ మరోవైపు తనకు ఎంతో ఇష్టమైన సంగీతంలో ఎంతో ప్రావీణ్యం పొందారు.

Telugu Background, Child Artist, Kommauyyala, Paduta Teeyaga, Ram Charan, Rrr, P

ఈ విధంగా ప్రకృతి రెడ్డి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో పాటలు పాడారు.అదే విధంగా ఈటీవీలో ప్రసారమవుతూ ఎంతో మంది గాయనీ గాయకులను చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన పాడుతా తీయగా కార్యక్రమంలో కూడా ప్రకృతి రెడ్డి తన అద్భుతమైన పాటల ద్వారా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారినీ ఫిదా చేసింది.ఇలా పాడుతా తీయగా కార్యక్రమం మాత్రమే కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలు కూడా పాడుతూ ఎంతోమంది ప్రముఖ గాయనీ గాయకుల నుంచి ప్రశంసలు అందుకున్న ప్రకృతి రెడ్డి RRR సినిమాలో ఈ పాట ద్వారా ఎంతో గుర్తింపు పొందారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube