నల్గొండ జిల్లా నకిరేకల్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది.తాటికల్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
నర్సింగ్ కాలేజ్ విద్యార్థినులు ప్రయాణిస్తున్న బస్సును వెనుక నుండి లారీ ఢీకొట్టింది.దీంతో అదుపు తప్పిన బస్సు పల్టీ కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న 30మంది విద్యార్థినిలకు గాయాలు అయ్యాయి.
వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.గాయపడ్డ విద్యార్థినిలను నకిరేకల్, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్టు సమాచారం.సూర్యాపేట నుండి నల్గొండ కు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.