రిచెస్ట్ క్రీడాకారుడు: ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా సంపాదిస్తున్న ఆటగాడు ఇతడే!

సర్వే ప్రకారం, ఈ ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు ఎక్కువ సంపాదిస్తున్నారు.ఒకరు సినిమా సెలిబ్రిటీలు, రెండు క్రీడాకారులు.

 Richest Player This Is The Highest Earning Player In The World , Rcihest Player , Sports Update , Latest News , Lionel Messi , Lebron James , Argentine Football Player , Money , Income , Highest Earning Player ,-TeluguStop.com

సినిమా సెలిబ్రిటీల సంగతి అందరికీ తెలిసిందే.స్పోర్ట్స్ మేన్స్ సంగతి మాత్రం అతికొంద్దిమందికి తెలుస్తుంది.

కాగా తాజాగా ఫోర్బ్స్ అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్ల జాబితా రిలీజ్ చేసింది.ఈ లిస్టులో ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాడి సంగతి ప్రస్తావించింది.

 Richest Player This Is The Highest Earning Player In The World , Rcihest Player , Sports Update , Latest News , Lionel Messi , LeBron James , Argentine Football Player , Money , Income , Highest Earning Player , -రిచెస్ట్ క్రీడాకారుడు: ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా సంపాదిస్తున్న ఆటగాడు ఇతడే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ అగ్రస్థానంలో ఉన్నట్టు ప్రకటించింది.ఫోర్బ్స్ వార్షిక జాబితాలో అమెరికా బాస్కెట్‌బాల్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్, మాంచెస్టర్ యునైటెడ్‌కు చెందిన క్రిస్టియానో​రొనాల్డో కంటే ఫ్రెంచ్ క్లబ్ PSG స్టార్ ఫార్వర్డ్ మెస్సీ ముందున్నాడు.

ఇకపోతే, ఇంతవరకు టాప్ ప్లేస్ లో వున్న మెస్సీ ఐరిష్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్ అయినటువంటి కోనార్ మెక్‌గ్రెగర్‌ ఇపుడు ఫస్ట్ ప్లేస్ కోల్పోయాడు.గత 12 నెలల్లో మెస్సీ 130 మిలియన్ డాలర్లు అంటే మన రూపాయలలో దాదాపు రూ.1007 కోట్లు సంపాదించాడు.కాగా మెక్‌గ్రెగర్ ఈసారి టాప్-10లో కూడా లేకపోవడం కొసమెరుపు.ఈసారి అత్యధిక వసూళ్లు చేసిన 10 మంది ఆటగాళ్లు మొత్తం $992 మిలియన్లు అంటే సుమారు రూ.7688 కోట్లు సంపాదించారు.ఈసారి టాప్-10 ఆటగాళ్ల మొత్తం సంపాదన మూడో అత్యధికంగా నిలిచింది.ఇది 2018లో $1.06 బిలియన్లు (సుమారు రూ.8210 కోట్లు)కాగా, 2021లో $1.05 బిలియన్లు (సుమారు రూ.8130 కోట్లు)గా ఉంది.

ఇకపోతే, మన విరాట్ కోహ్లీ సంపాదనకు మాత్రం ఏ లోటు లేదన్న సంగతి తెలిసినదే.స్పోర్ట్స్ బిజినెస్ వెబ్‌సైట్ స్పోర్టికో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 61వ స్థానంలో ఉండటం గమనార్హం.ఈ జాబితాలో ఉన్న ఏకైక క్రికెటర్, ఏకైక భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలవడం నిజంగా భారత్ కి గర్వకారణం.ఈ నివేదిక ప్రకారం, విరాట్ ఈ సంవత్సరం ప్రకటనలు, జీతం, ప్రైజ్ మనీ ద్వారా మొత్తం రూ.262 కోట్లు సంపాదించాడు.ఇందులో విరాట్ జీతం, ప్రైజ్ మనీ ద్వారా రూ.22 కోట్లు, ప్రకటనల ద్వారా మిగిలిన రూ.240 కోట్లు సంపాదించాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube