నేడే తొలి ఏకాదశి... తొలి ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం!

మన హిందూ ధర్మంలో ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు విశిష్టతలు దాగి ఉన్నాయి.అదే విధంగా ప్రతి నెల ఎన్నో రకాల పండుగను ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

 Religious Importance And Significance Of Tholi Ekadasi Ekadasi, Religious Festiv-TeluguStop.com

ఈ క్రమంలోనే సంవత్సరంలో మనకు 12 ఏకాదశులు వస్తాయి.ఈ ఏకాదశిని హిందువులు ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

ఈ ఏకాదశిలలో ఆషాడమాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది.ఈ ఏకాదశిని హిందువులు తొలి ఏకాదశి, శయన ఏకాదశి,హరివాసరం అని కూడా పిలుస్తారు.

మరి ఎంతో విశిష్టత కలిగిన ఈ తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి? ఈ రోజు పూజా ఎలా చేయాలి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగా భావిస్తారు.2021 జూలై 20 వ తేదీన తొలి ఏకాదశిని జరుపుకుంటున్నారు.ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి శయన పాన్పుపై భక్తులకు దర్శనమిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.

పురాణాల ప్రకారం ఈ ఏకాదశి నుంచి సూర్యుడు దక్షిణాయనం దిశలో మనకు కనిపిస్తారు.తొలి ఏకాదశి ని రైతులు విత్తనాల ఏకాదశిగా కూడా జరుపుకుంటారు.మరి ఎంతో విశిష్టమైన ఈ తొలి ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి తెలుసుకుందాం.</br.

Telugu Hindu, Hindu Gos, Festival, Tholi Ekadasi-Telugu Time Sensitive Content

తొలి ఏకాదశి రోజు భక్తులు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.తొలి ఏకాదశి పండుగ రోజు జరుపుకునే వారు ఉదయమే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకునే విష్ణు దేవుడి ఫోటో లేదా విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేస్తారు.ఈ పూజ చేసేవారు ధాన్యాలు, పప్పులు, శనగలు, మొక్క జొన్న, గోకరకాయ, చిక్కుడుకాయ, బఠాణిలను ఆహారపదార్ధాలుగా తీసుకోకూడదు.కేవలం పాలు పండ్లు వంటి పదార్థాలను తీసుకునీ ఉపవాస దీక్షతో పూజ చేయాలి.

ఒకవేళ ఏకాదశి పండుగను జరుపుకొనివారు ఈరోజు మాంసం గుడ్లు చేపలు వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు.ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు కనుక ఈరోజు ఎట్టి పరిస్థితులలో తులసీ దళాలను కోయకూడదు.

అలాగే స్వామి వారి పూజ అనంతరం స్వామివారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత విష్ణు సహస్రనామాలను చదవాలి.అదే విధంగా ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయమే స్వామివారికి పూజ చేసిన అనంతరం ఉపవాస దీక్ష విరమించాలి.

ఈ విధంగా తొలిఏకాదశి పండుగను హిందువులు ఎంతో భక్తి భావంతో జరుపుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube