Rekha Harris : అలాంటి హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడం లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటి?

నటి రేఖ( Actress Rekha ) అప్పట్లో ఈమె తెలుగులో రుద్రనేత, కొండపల్లి రాజా వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమాల ద్వారా ఈమె మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికి ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ భాషలకే పరిమితం అయ్యింది.

 Rekha Harris Comments 40 Plus Heroines Situation-TeluguStop.com

ఒకవైపు సినిమాలలో నటించడంతో పాటు మరోవైపు సీరియల్, షోల్లో కనిపిస్తూ అలరిస్తోంది.ఇది ఇలా ఉంటే రేఖ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా మిరియం మా.ఐర్లాండ్ కి చెందిన మాలతి నారాయణన్ దర్శకురాలు.ఆమెనే ఈ చిత్రానికి నిర్మాత కూడా.

త్వరలో ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నారు.ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో గురువారం ఒక ఈవెంట్ నిర్వహించారు.


Telugu Actress Rekha, Offers-Movie

ఇందులో పాల్గొన్న రేఖ.హీరోయిన్ల జీవితం( Heroines Life ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.’నేను 35 ఏళ్లుగా నటిస్తున్నాను.మొదట్లో హీరోయిన్‌గా, ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రకరకాల పాత్రలు చేశాను.నేను చేసిన చిత్రాల్లోని పాత్రల పేర్లతో నన్ను పిలుస్తుండడం సంతోషంగా ఉంది.ప్రస్తుతం 40 ఏళ్లు దాటిన లేడీ యాక్టర్స్‌ని( Lady Actors ) దర్శకులు పక్కన పెట్టేస్తున్నారు.కానీ నాలాంటి చాలామందికి మంచి పాత్రల్లో నటించాలనే కోరిక ఉంటుంది.

నేను మాత్రం బతికున్నంత వరకు నటిస్తూనే ఉంటాను.

Telugu Actress Rekha, Offers-Movie

ఒకప్పుడు హీరోయిన్లకు నటించడానికి ఛాన్స్ ఉండేది.ఇప్పుడు కమర్షియల్‌ చిత్రాల్లో హీరోయిన్లకు అసలు ప్రాధాన్యం లేకుండా పోయింది అంటూ రేఖ తన ఆవేదనను వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా రేఖ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవ్వడంతో కొందరు ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ అవును నిజమే ఈ మధ్యకాలంలో అలా చాలామంది నటీమణులు అవకాశాలు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఆమె వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీలో కొందరు నటులు కూడా స్పందించారు.మరి రేఖ ఆవేదనను అర్థం చేసుకొని ఇకమీదట అయినా అలాంటి నటులకు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube