ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన యమున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.యమున మాట్లాడుతూ ఏదైనా సమస్య వస్తే నేను రెబల్ గా ఉంటానని ఆమె కామెంట్లు చేశారు.
బాలచందర్ గారు నా పేరు మార్చారని ఆమె కామెంట్లు చేశారు.విధి వల్ల నేను ఆర్టిస్ట్ గా మారానని ఆమె చెప్పుకొచ్చారు.
నేను చేసిన సినిమాల గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నారని ఆమె తెలిపారు.
నేను నటించిన పుట్టింటి పట్టుచీర సినిమా చిరంజీవి సినిమాకు ఈక్వల్ గా ఆడిందని యమున తెలిపారు.
అన్వేషిత సీరియల్ కోసం నన్ను వెతుక్కుంటారని వచ్చారని ఆమె అన్నారు.ఈటీవీ సుమన్ వల్లే నాకు ఆఫర్ వచ్చిందని యమున పేర్కొన్నారు.సీనియర్ హీరోయిన్ యమున స్టార్ హీరోలకు జోడీగా నటించకపోవడానికి కారణం చెబుతూ గ్లామర్ రోల్స్ చేయకపోవడం ఒక కారణమని ఆమె తెలిపారు.
నా క్యాస్టూమ్స్ డల్ గా ఉండేవని ఈ రీజన్ వల్ల కూడా స్టార్స్ సినిమాలలో నాకు ఛాన్స్ రాలేదని యమున తెలిపారు.ఎమోషన్ లేకుండా మనిషి ఉండరని అయితే దానిని బ్యాలెన్స్ చేయడం ముఖ్యమని యమున కామెంట్ చేశారు.నేను ఎవరికీ పోటీ ఇవ్వలేదని ఆమె కామెంట్లు చేశారు.
నా జోన్ సపరేట్ అని యమున చెప్పుకొచ్చారు.దాసరి డైరెక్షన్ లో నేను ఎక్కువగా సినిమాలు చేశానని యమున పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీ ఎలా ఉందో కూడా తెలియదని యమున తెలిపారు.ట్యాక్సీవాలా సినిమాలో మాత్రమే నేను చేశానని ఆమె చెప్పుకొచ్చారు.సినిమాల కోసం సీరియళ్లను వదులుకోవడం సాధ్యం కాదని యమున అన్నారు.యమున వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అమ్మాయిలకు నేను చాలా సపోర్ట్ గా నిలబడతానని యమున కామెంట్లు చేయడం గమనార్హం.