సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ కామెంట్లే తప్ప నెగిటివ్ కామెంట్లు తక్కువ వస్తాయి.అన్ని విషయాల్లో ప్రూవ్ చేసుకున్న వాళ్లకు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ వస్తుందనే సంగతి తెలిసిందే.
ప్రముఖ సింగర్ స్మిత హోస్ట్ గా సోనీ లివ్ ఓటీటీలో నిజం విత్ స్మిత పేరుతో త్వరలో ఒక షో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే.ఈ షోకు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు సైతం ఈ షోకు హాజరవుతున్నారు.
అయితే చిరంజీవి ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా హాజరు కాగా ఈ ప్రోమో తాజాగా విడుదలైంది.జగిత్యాలలో తనపై కోడిగుడ్లు విసిరారని చిరంజీవి వెల్లడించారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో భాగంగా జగిత్యాలకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.చిరంజీవి రాజకీయాలకు దూరం కావడానికి ఆ అవమానాలే కారణమని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఈ ఘటన జరిగిన సమయంలో కోడిగుడ్లు తలకు రాసుకుంటే మంచిదని చిన్నప్పుడు చెప్పారని అవి వేసి వాళ్ల కుసంస్కారాన్ని నిలుపుకుంటున్నారని చిరంజీవి గతంలో చెప్పుకొచ్చారు.ఈ ఘటన అప్పట్లో మెగా అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది.ఆ సమయంలో కొంతమంది మంచివాళ్లు ప్రజలకు నచ్చరని కామెంట్ చేశారు.అందుకే చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారని మెగా అభిమానులు భావిస్తారు.
చిరంజీవికి సహాయం చేయడం మాత్రమే తెలుసని ఫ్యాన్స్ చెబుతున్నారు.అయితే పీఆర్పీ గురించి ఎన్నో ఫేక్ ప్రచారాలు రావడం కూడా ఆ పార్టీకి మైనస్ అయింది.ఇన్ని అవమానాలను భరించి కూడా ఆయన ముఖంలో చిరునవ్వు చెరగలేదని అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.చిరంజీవిని అభిమానులు మాత్రం దేవుడిలా భావిస్తారనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలలో నటిస్తున్నారు.