బాలకృష్ణ టైం ఈమద్య అస్సలు బాగున్నట్లుగా లేదు.కొడుకును హీరోగా చేద్దామని అనుకుంటే అతడు బరువు తగ్గడం లేదు.2020లో మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని బాలయ్య చాలా ఆశపడ్డాడు.కాని అనుకున్నది ఒక్కటి అయితే జరుగుతున్నది మరోటి.
ఇక ఇదే సమయంలో బాలయ్య హీరోగా చేస్తున్న సినిమాలు అన్నీ కూడా చాలా దారుణమైన కలెక్షన్స్ నమోదు చేస్తున్నాయి.అంటే డిజాస్టర్స్‌గా నిలుస్తున్నాయి.ఈ నేపథ్యంలో బాలయ్యకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్ సందర్బంగా ఇలా గుండులుక్తో కనిపించాడు.సాదారణంగా ఎప్పుడైనా బాలయ్య విగ్‌తో మాత్రమే కనిపిస్తాడు.
బట్టతల చాలా ఉండటంతో బాలయ్య విగ్ లేకుండా బయటకు రాడు.కాని ఈసారి మాత్రం పూర్తిగా గుండుతో బాలయ్య ఫొటోకు ఫోజ్ ఇచ్చాడు.
పెద్ద మీసాలు గుండు గెటప్ చూసి అంతా అవాక్కవుతున్నారు.బాలయ్య కొత్త గెటప్ వింతగా విచిత్రంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బాలయ్య ఈమద్య తిరుమలకు వెళ్లిన సమయంలో వెంకటేశ్వర స్వామికి తల నీలాలు ఇచ్చాడని, అందుకు సంబంధించిన లుక్ అంటూ నందమూరి కుటుంబానికి సన్నిహితంగా ఉండే వారు చెబుతున్నారు.బాలయ్య గుండు చాలా బాగుందని కొందరు కామెంట్స్ చేస్తుంటే బోయపాటి సినిమాలో ఇలాగే కనిపించబోతున్నాడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి బాలయ్య గుండు లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.