రైతులకు, వ్యాపారులకు ఆర్బీఐ శుభవార్త... సులభంగా రుణాలు?

దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి వల్ల రైతులు, వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతోంటే లాక్ డౌన్ వల్ల వ్యాపారులు గతంలో ఎప్పుడూ చూడని నష్టాలను చవిచూస్తున్నారు.

 Reserve Bank Of India Good News To Farmers And Business Man, Rbi, Start Up Farmm-TeluguStop.com

తాజాగా ఆర్బీఐ రైతులకు, వ్యాపారులకు శుభవార్త చెప్పింది. స్టార్టప్స్, రైతులకు 50 కోట్ల రూపాయల మేర ప్రయోజనం కలిగేలా చేసింది.

ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ ద్వారా ఆర్బీఐ రైతులు, వ్యాపారులు 50 కోట్ల రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చని తెలిపింది.కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ లేదా సోలార్ ప్లాంట్ కోసం రుణాన్ని పొందవచ్చని పేర్కొంది.

ఆర్బీఐ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ నిబంధనలను నిన్న ఈ మేరకు సవరించింది.రైతులు, బలహీన వర్గాలు నిబంధనల సడలింపు వల్ల గతంలోలా కాకుండా సులువుగా పొందవచ్చని ఆర్బీఐ నుంచి కీలక ప్రకటన వెలువడింది.

హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ లాంటి విభాగాలకు ఎక్కువ మొత్తంలో రుణాలను మంజూరు చేస్తామని ఆర్బీఐ తెలిపింది.స్టార్టప్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్బీఐ కోరింది.

రైతులు, స్టార్టప్స్ బ్యాంకుల నుంచి సులభంగా రుణాలను పొందవచ్చని ఆర్బీఐ పేర్కొంది.రైతులు గ్రూపులుగా ఏర్పడి ఈ ప్రయోజనాన్ని పొందవచ్చని ఆర్బీఐ ప్రకటించింది.

అయితే ఆర్బీఐ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో జిల్లాలకు మాత్రమే ఈ ప్రయోజనం చేకూరేలా చేస్తోందని తెలుస్తోంది. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులు, వ్యాపారులు ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube