మీ అందరికి ఎటిఎం గురించి తెలిసే ఉంటుంది.బ్యాంకుల మాదిరిగా ఎటిఎం కు ఒక నిర్ణిత సమయం అనేది ఉండదు.
ఏప్పుడు కావాలంటే అప్పుడు మెషిన్ లో నుంచి డబ్బులు తీసుకోవచ్చు.అయితే ఇప్పుడు మనీ ఎటిఎం లాగానే రేషన్ ఎటిఎం కూడా వచ్చేసిందండోయ్.
ఏంటి ఎటిఎం మెషీన్ లో రేషన్ సరుకులు ఎలా తీసుకుంటాము అని ఆలోచిస్తున్నారా.? అసలు ఇది సాధ్యమేనా అని అనుకుంటున్నారా.? కానీ హరియానా ప్రభుత్వం ఈ ప్రయోగాన్ని చేసి విజయవంతం అయింది.మన అందరికి తెలిసే ఉంటుంది రేషన్ షాప్ లో సరుకులు తీసుకోవాలంటే గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండి మరి సరుకులు తీసుకోవాలి.
అయితే ఇప్పుడు అలాంటి బాధ లేకుండా హరియానా రాష్ట్రం లోని గురుగావ్ లోని ఫరూక్ నగర్ లో ఈ తరహా ఏటిఎంను ఏర్పాటు చేసింది.బయో మెట్రిక్ విధానం ద్వారా అంటే వేలిముద్రల ఆధారంగా ఈ రేషన్ ఏటీఎం వర్క్ చేస్తుంది అన్నమాట.
అసలు ఈ మెషిన్ ఎలా పనిచేస్తుందో ఒకసారి తెలుసుకుందాం.రేషన్ కార్డులో ఉన్న ఎవరయినా రేషన్ కార్డు దారుడు ఎటిఎంలో కనిపించే టచ్ స్ర్కీన్ ద్వారా అతని అధార్ నెంబర్ కాని లేదంటే రేషన్ కార్డ్ నంబర్ కానీ ఎంటర్ చేయాలి.
అప్పుడు మనం ఎంటర్ చేసిన నెంబర్ ఆ కార్డు లో ఉన్న వ్యక్తిదో కాదో అని సిస్టం వెరిఫై చేసి ఓకే చేస్తుంది.అప్పుడు బయోమెట్రిక్ వేయాలి.
తరువాత వెంటనే కార్డులో ఉన్న పేర్లు ఆధారంగా సరిపడా బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు ఒకదాని తరువాత ఒకటిగా మెషీన్ లో నుంచి బయటకు వస్తాయి.తూకం లో ఎటువంటి తప్పిదం లేకుండా సరిపడా క్వాంటిటీలో సరుకులు వస్తాయి.

అయితే కార్డు దారుడు చేయవలసిన పని ఒకటి ఉంది.అది ఏంటంటే.సరుకులు బయటకు వస్తున్నప్పుడు మిషన్ క్రింద తాము తెచ్చుకున్న ఖాళీ సంచిని ఒకదాని తరువాత ఒకటి పెట్టాలి.అంతే., మెషీన్ లో నుంచి సరుకులు వాటంతట అవే విడుదల అవుతాయి.అయితే హర్యానా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ రేషన్ ఎటిఎం విధానం పట్ల ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి.
అయితే ఈ విధానం పట్టణాల్లో వుండే వారికి సులువుగానే ఉంటుంది.కానీ.
, మారుమూల పల్లెల్లో, గ్రామాల్లో ఉండే వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందనే చెప్పాలి.ఎందుకంటే అక్కడి వాళ్లకు ఈ మెషీన్ ఎలా ఉపయోగించాలో తెలియదు.
అలాగే ఈ మెషీన్ పని చేయాలంటే ఇంటర్నెట్ కచ్చితంగా ఉండి తీరాలిసిందే.మరి పల్లెటూరిలో నెట్ సరిగా ఉండదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.