రష్మిక బర్త్ డే.. ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మాజీ ప్రియుడు..?

సౌత్ ఇండియాలోని దాదాపు అన్ని భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు రష్మిక మందన్నా.గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఏ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా ఆ ఇండస్ట్రీలో విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

 Rashmika Mandanna Birthday Her First Movie Kirik Party Audition Video Goes Viral-TeluguStop.com

ఈ నెల 2వ తేదీన విడుదలైన సుల్తాన్ సినిమాతో రష్మిక మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.నిన్న రష్మిక పుట్టినరోజు.

రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప సినిమాతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు.

నిన్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నుంచి హోమ్లీ లుక్ లో ఉన్న రష్మిక పోస్టర్ విడుదలైంది.

ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు.కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి.మరోవైపు రష్మిక బర్త్ డే సందర్భంగా ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి అరుదైన వీడియోను షేర్ చేసి ఆమెకు, ఆమె ఫ్యాన్స్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు.

కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమాతో రష్మిక మందన్నా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆ సినిమా అడిషన్స్ కు సంబంధించిన వీడియోను రక్షిత్ శెట్టి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

రక్షిత్ రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు రష్మిక తన సినీ కెరీర్ లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని పోస్ట్ చేశారు.రక్షిత్ షేర్ చేసిన వీడియో గురించి రష్మిక మందన్న స్పందించారు.

రక్షిత్ కు థ్యాంక్స్ చెప్పడంతో పాటు ఆ క్షణాలు తనకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయని ఆమె అన్నారు.రష్మిక బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుండగా ఆ సినిమాలు హిట్టైతే మాత్రం రష్మిక క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube